ఎంపీ గన్ మెన్,ఫోటోగ్రాఫర్ కి కరోనా!  

YSRCP MP Bharath gunman and photographaer tests positive for covid-19 , Coronavirus, AP, YSRCP, MP, Bharath, Gunman ANd Photographer, Covid 19 - Telugu Ap, Bharath, Coronavirus, Covid-19, Gunman And Photographer, Mp, Ysrcp

దేశంలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న విషయం తెలిసిందే.ఈ కరోనా మహమ్మారి సామాన్యులతో పాటు ప్రజా ప్రతినిధులను కూడా తాకుతుండడం మరింత ఆందోళన కలిగిస్తుంది.

 Coronavirus Ap Ysrcp Mp Bharath

ఏపీ లో కూడా కరోనా విజృంభిస్తుంది.ఇప్పటికే రాష్ట్రంలో ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా సోకగా,మరోపక్క ఎమ్మెల్యేల వద్ద పనిచేసే గన్ మెన్ లు పలువురు సిబ్బంది కూడా ఈ కరోనా మహమ్మారి బారిన అపడుతున్నారు.

ఆ మధ్యన ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట రామిరెడ్డి గన్‌మెన్‌ కరోనాతో మృతిచెందారు.మొన్నటికి మొన్న ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి దగ్గర పనిచేసే ఇద్దరు కానిస్టేబుల్‌లు ఈ వైరస్‌ బారిన పడ్డారు.

ఎంపీ గన్ మెన్,ఫోటోగ్రాఫర్ కి కరోనా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అంతేకాకుండా తెలంగాణా లో కూడా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వద్ద పని చేస్తున్న గన్ మెన్ లకు కరోనా సోకడం ఇలా రోజు రోజుకు ప్రజా ప్రతినిధుల వద్ద పనిచేసే వారు కరోనా బారిన పడుతున్నారు.ఇంకా ఈ ఘటనల నుంచి తేరుకోకుండానే తాజాగా తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వైసీపీ ఎంపీ మార్గాని భరత్ రామ్ గన్‌మెన్‌, ఫొటోగ్రాఫర్‌కి కరోనా సోకినట్లు తెలుస్తుంది.

ఆయన వద్ద పనిచేసే గన్ మెన్, ఫోటోగ్రాఫర్ లకు కరోనా పాజిటివ్ రావడం తో అప్రమత్తమైన అధికారులు వెంటనే ఎంపీ కి కూడా కరోనా పరీక్షలు నిర్వహించాహగా నెగిటివ్ రావడం తో ఊపిరిపీల్చుకున్నారు.కాగా పార్లమెంట్ సమావేశాలకు వెళ్లి వచ్చినప్పటి నుంచి భరత్‌ హోం క్వారంటైన్‌లో ఉన్నారు.

తానే సొంతగా కారు డ్రైవ్ చేసుకుంటూ, గన్‌మెన్‌ లేకుండా కరోనా నివారణ చర్యలు పాటిస్తూ ప్రభుత్వ కార్యక్రమాలకు హాజరవుతున్నట్లు తెలుస్తుంది.

#COVID-19 #AP #Bharath #MP #Ysrcp

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Coronavirus Ap Ysrcp Mp Bharath Related Telugu News,Photos/Pics,Images..