అమెరికా పరిశోధన : కరోన సోకినా రోగులకి మరో ప్రాణాంతక వ్యాధి..!!!

కరోనా పేరు వింటేనే ప్రపంచ వ్యాప్తంగా అందరికి గుబులు కలుగుతోంది.దేశాధి నేతలు మొదలు, సామాన్య ప్రజలు అందరిని కరోనా హడలెత్తిస్తోంది.

 Another Virus Empact On Coronavirus Peoples, Coronavirus, America, New Syndrome,-TeluguStop.com

ఏ ఒక్కరిని వదల అంటూ ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మందిపై తన ప్రభావాన్ని చూపించిన ఈ మహమ్మారి కరోనా శరీరంలోకి ఎంట్రీ ఇస్తే మరొక మహాదారి వ్యాధి కూడా సోకుతోందని అమెరికా పరిశోధకులు గుర్తించారు.కరోనాతో కంగారు పడిపోతున్న వారికి ఈ వార్త మరింత టెన్షన్ రేపుతోంది.

ఇంతకీ ఏమిటా వ్యాధి.కరోనా కారణంగానే వస్తోందా.

అనే వివరాలలోకి వెళ్తే.

కరోన బారిన పడిన వారిలో దాదాపు చాలా మందికి ప్రాణాంతక సిండ్రోమ్ ఒకటి శరీరంలో ఉన్నట్టుగా శాస్త్రవేత్తలు గుర్తించారు.

ఇలాంటి కేసులు ఇప్పటికే దాదాపు చాలా దేశాలలో గుర్తించబడ్డాయి.అయితే తాజాగా అమెరికాల కరోనా రోగులకి దాదాపు 300 మందిలో ఈ సిండ్రోమ్ గుర్తించారు నిపుణులు.ఈ సిండ్రోమ్ బారిన అత్యదికంగా చిన్న పిల్లలు పడుతున్నారని తాజా పరిశోధనలో తేలింది.చిన్న పిల్లలు మొదలు సుమారు 21 ఏళ్ళ వయసు ఉన్న వారి ఈ వ్యాధి బారిన పడుతున్నారని తెలిపారు.

Telugu America, Coronavirus, Syndrome-Telugu NRI

ఈ సిండ్రోమ్ కారణంగా జ్వరం రావడం, విపరీతమైన దగ్గు, దద్దుర్లు రావడం గుండెల్లో మంట కలగడం జరుగుతోందని తెలిపారు.కరోన సోకిన 28 రోజుల తరువాత ఈ వ్యాధి బయటపడుతోందని తెలిపారు.లక్ష మంది కరోనా రోగులలో సుమారు 300 కి ఈ వ్యాధి లక్షణాలు ఉన్నాయని, ఈ వ్యాధి బారిన పడి ఇప్పటికే సుమారు 100 మందికి పైగా మరణించారని తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉందని పరిశోధకులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube