జూన్‌, జులైలో కేసుల సంఖ్య లక్షల్లో ఉండొచ్చన్న ఎయిమ్స్‌ డాక్టర్‌

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగే అవకాశం ఉందంటూ ఆందోళనకర విషయాన్ని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ రణదీప్‌ గేలేరియా వ్యక్తం చేశారు.ప్రస్తుతం దేశంలో అమలు చేస్తున్న లాక్‌డౌన్‌ పని చేస్తుందని, అయినా కూడా జూన్‌ జులై నెలల్లో కేసుల సంఖ్య భయంకర స్థాయిలో పెరిగే ప్రమాదం ఉందంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశాడు.

 Aiims Doctors Give The Message To Coronavirus About June And July Month, Coronav-TeluguStop.com

రెండు వారాల క్రితం వరకు వందల్లో కేసులు నమోదు అయితే ప్రస్తుతం కేసుల సంఖ్య మూడు నుండి నాలుగు వేల చొప్పున నమోదు అవుతున్న నేపత్యంలో రాబోయే రోజుల్లో మరింత ప్రమాదకరంగా కేసుల సంఖ్య ఉంటుందనే ఆందోళన వ్యక్తం అవుతుంది.

తాజాగా మొత్తం కేసుల సంఖ్య 52 వేలను దాటేసింది.

మరో 50 వేలకు రెండు వారాలకు మించి పట్టకు పోవచ్చు అంటున్నారు.ఈ సమయంలో లాక్‌డౌన్‌ సడలింపులు ఇవ్వడంతో పాటు వైన్స్‌ ఓపెన్‌ చేయడం వల్ల కూడా ప్రమాదకరంగా వైరస్‌ వ్యాప్తి చెందుతుందనే ఆందోళన అందరిలో వ్యక్తం అవుతుంది.

రణదీప్‌ గెలేరియా కూడా అదే విషయాన్ని వెళ్లడి చేశారు.వచ్చే రెండు నెలల్లో వైరస్‌ పెరిగే శాతాన్ని ఊహించుకుంటే భయంగా ఉందంటూ ప్రముఖులే ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సామాన్యులు సాధ్యం అయినంతగా సామాజిక దూరం పాటిస్తూ జాగ్రత్తలు వహించాల్సి ఉంది.

అందుకే ఇంటికే పరిమితం అయ్యి ఆరోగ్యంగా ఉండటం బెటర్‌.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube