ఏపీకి పయనం అయిన వెబ్‌ సిరీస్‌ టీమ్స్‌

గత రెండు నెలలుగా సినిమాల షూటింగ్స్‌ సీరియల్స్‌ షూటింగ్స్‌ పూర్తిగా ఆగిపోయాయి.దాంతో సీరియల్స్‌ పాత ఎపిసోడ్స్‌ మళ్లీ వస్తుండగా, సినిమా థియేటర్లు మూత పడి ఉన్నాయి.

 Web Series Movie Shootings Going On Ap, Tollywood, Telugu Movie Shootings, Coron-TeluguStop.com

కనీసం వెబ్‌ సిరీస్‌లు అయినా ప్రసారం చేద్దామనుకుంటే అవి కూడా షూటింగ్స్‌ చేసి లేవు.లాక్‌డౌన్‌ ముందు వరకు షూట్‌ చేసిన వెబ్‌ సిరీస్‌లు అన్ని ప్రసారం అయ్యాయి.

ఆహాతో పాటు పలు ఓటీటీలు తెలుగు వెబ్‌ సిరీస్‌లను పెద్ద సంఖ్యలో ప్రసారం చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాయి.

తెలుగు వెబ్‌ సిరీస్‌ల షూటింగ్స్‌కు అనుమతించాలంటూ ఇటీవలే తెలంగాణ ప్రభుత్వంకు అల్లు అరవింద్‌ విజ్ఞప్తి చేసిన విషయం తెల్సిందే.

కాని తెలంగాణలో ఇప్పటి వరకు షూటింగ్స్‌ అనుమతి ఇవ్వలేదు.ఏపీలో మాత్రం షూటింగ్స్‌కు అనుమతిస్తూ ప్రకటన వచ్చింది.

ఈ నెలాఖరు వరకు తెలంగాణలో షూటింగ్స్‌ జరిగే పరిస్థితి లేని కారణంగా ఏపీలో షూటింగ్స్‌కు వెళ్లాలని వెబ్‌ సిరీస్‌ మరియు సీరియల్‌ షూటింగ్స్‌కు రెడీ అవుతున్నారు.

Telugu Allu Aravindhu, Ap Telangana, Coronavirus, Ott Plat Farm, Telugu, Tollywo

కేసీఆర్‌ ప్రభుత్వం నుండి ఇన్ని రోజులు అనుమతులు వస్తాయని ఎదురు చూసిన వారు ఇక ఏపీలో అయినా షూటింగ్స్‌ చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చారు.ఆహా కు చెందిన మూడు వెబ్‌ సిరీస్‌ల టీంలు ఏపీలో పలు ప్రాంతాల్లో షూటింగ్స్‌కు సిద్దం కాబోతున్నాయట.ఇదే సమయంలో కొన్ని సీరియల్స్‌ కూడా ఏపీలో వైజాగ్‌ మరియు గుంటూరు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపేందుకు అనుమతులు కోరుతున్నట్లుగా తెలుస్తోంది.

జూన్‌ మొదటి వారం నుండి తెలంగాణలో షూటింగ్స్‌కు అనుమతించే అవకాశం ఉందని అంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube