కరోనాపై తెలుగు సినిమా ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది  

అ! మరియు కల్కీ చిత్రాలతో దర్శకుడిగా విమర్శకుల ప్రశంసలు దక్కించుకోవడంతో పాటు పలు చిత్రాల స్క్రిప్ట్‌ విషయంలో కీలక పాత్ర పోషించిన దర్శకుడు ప్రశాంత్‌ వర్మ.ఈ దర్శకుడు ఎప్పటికప్పుడు విభిన్న చిత్రాలను తెరకెక్కిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్నాడు.ప్రస్తుతం ఈయన మరో ప్రయోగానికి సిద్దం అయ్యాడు.ఈసారి ఈయన ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనాపై సినిమాను చేస్తున్నాడు.ఇండియాలో ఇలాంటి సినిమా తెరకెక్కడం ఇదే ప్రథమం.

TeluguStop.com - Coronavirus Aa Kalki Zombie Reddy Zombie Zoner Prashanth Varma

ఈ ఏడాది ఆరంభంలో సినిమాను ప్రారంభించాడు.

చైనాలో ఈ వైరస్‌ తాలూకు ఉదృతి ఉన్న సమయంలో కథ అనుకున్న ప్రశాంత్‌ వర్మ వెంటనే షూటింగ్‌ కూడా మొదలు పెట్టాడు.అయితే ఇండియాలో కరోనా పెరగడంతో ఆ సినిమా ఆగిపోయింది.

TeluguStop.com - కరోనాపై తెలుగు సినిమా ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది-Movie-Telugu Tollywood Photo Image

మళ్లీ ఇప్పుడు షూటింగ్‌ ప్రారంభించాడు.తుది షెడ్యూల్‌ బ్యాలన్స్‌ ఉన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను ప్రశాంత్‌ వర్మ విడుదల చేశాడు.

ఈ సినిమాకు విభిన్నంగా ఉండాలనే ఉద్దేశ్యంతో జాంబీ రెడ్డి అనే టైటిల్‌ను ఖరారు చేయడం జరిగింది.

ఇండియాలో ఇప్పటి వరకు జాంబీ జోనర్‌లో సినిమా వచ్చింది లేదు.మొదటి సారి తెలుగులో సినిమా చేస్తున్నాను అంటూ ఈ పోస్టర్‌లో ప్రశాంత్‌ వర్మ ప్రకటించాడు.దాంతో అందరి అంచనాలు భారీగా ఉన్నాయి.

అసలు జాంబీ జోనర్‌ అంటే ఏంటీ అనేది కూడా కొద్ది మందికి తెలియదు.అలాంటి జోనర్‌లో ప్రశాంత్‌ వర్మ సినిమా అంటే ఖచ్చితంగా మంచి బిజినెస్‌ అయితే చేసే అవకాశం ఉంది.

థియేటర్లు ఓపెన్‌ అయిన వెంటనే ఈ సినిమాను విడుదల చేస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం అవుతుంది.ఫస్ట్‌లుక్‌కు మంచి రెస్పాన్స్‌ వస్తున్న నేపథ్యంలో సినిమా కూడా ఆకట్టుకుంటుందేమో చూడాలి.

#Prashanth Varma #Zombie Zoner #Kalki #Coronavirus #Zombie Reddy

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Coronavirus Aa Kalki Zombie Reddy Zombie Zoner Prashanth Varma Related Telugu News,Photos/Pics,Images..