మార్చిలో కేటీఆర్ కు పట్టాభిషేకం?  

తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ త్వరలో సీఎం గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు అనే వార్త గత కొన్నేళ్లుగా వినబడుతోంది.అప్పుడు ఆ విషయాన్ని కేటీఆర్ పలు ఇంటర్వ్యూలలో జర్నలిస్టులు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడం జరిగింది.

TeluguStop.com - Coronation Of Ktr In March

అయితే మరోసారి రాజకీయ వర్గాలలో ఇటీవల కేసీఆర్ కు తరచుగా ఆరోగ్య సమస్యలు వస్తుండడంతో సీఎం పీఠాన్ని కేటీఆర్ కు అప్పజెప్పాలని కేసీఆర్ బలంగా నిర్ణయించినట్లు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.ఈ వ్యూహంలో భాగంగానే జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతలు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి, ఐటీ శాఖ మంత్రి పదవి ఇలా అన్ని ముఖ్యమైన బాధ్యతలు ప్రజలతో నేరుగా సత్సంబంధాలు కలిగి ఉండే బాధ్యతలు.

కావున వీటన్నింటిలోకేటీఆర్ మార్క్ నిరూపించుకున్నాడు కాబట్టి సీఎం స్థాయి పదవిని కేటీఆర్ సమర్థవంతంగా నడపగలడని గట్టి నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది.ఈ ప్రచారానికి బలం చేకూరేటట్టు కేటీఆర్ కు సీఎం పదవి ఇస్తే ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేలు స్వంత పార్టీ ప్రారంభించే ఆలోచనలో ఉన్నారని ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి తెలిస్తే.

TeluguStop.com - మార్చిలో కేటీఆర్ కు పట్టాభిషేకం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ఏది ఏమైనా జాతకాలను, పంచాంగాన్ని బలంగా విశ్వసించే ముఖ్యమంత్రి కేసీఆర్ మార్చిలో ఉగాది సందర్భంగా కేటీఆర్ కు పట్టాభిషేకం చేయాలని నిర్ణయించినట్లు రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

.

#@CM_KCR #GHMC Elections #@KTRTRS

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు