కరోనా మళ్లీమళ్లీ సోకుతుందంటున్న బ్రిటన్ శాస్త్రవేత్తలు..!  

corona will remain as a seasonal infection, coronavirus, seasonal disease, british scientists, cold, cough, corona symptoms - Telugu British Scientists, Cold, Corona Like Cold, Corona Symptoms, Corona Vaccine, Corona Virus, Corona Will Remain As A Seasonal Infection, Coronavirus, Cough, Seasonal Disease

2019 డిసెంబర్ నెలలో చైనా దేశంలోని వుహాన్ లో విజృంభించిన కరోనా మహమ్మారి ఆ దేశం నుంచి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందింది.ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్ పై ఈ మహమ్మారి ప్రభావం ఎక్కువగా పడింది.

TeluguStop.com - Corona Will Remain As A Seasonal Infection

కేసుల సంఖ్య తగ్గుతున్నా మరికొన్ని రోజుల్లో చలికాలం రానుండటంతో మళ్లీ కేసులు, మరణాలు పెరిగే అవకాశాలు ఉన్నాయని.ప్రజలు నిర్లక్ష్యం వహిస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఇలాంటి సమయంలో బ్రిటన్ శాస్త్రవేత్తలు మరో సంచలన విషయం వెల్లడించారు.కరోనా వైరస్ కూడా జలుబులాంటిదేనని మళ్లీమళ్లీ కరోనా సోకే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.బ్రిటన్‌లోని ఇంపీరియల్‌ కాలేజ్‌ లండన్‌ శాస్త్రవేత్త వెండీ బార్క్ ‌లే మాట్లాడుతూ ప్రతి ఒక్కరికీ సహజంగా వచ్చే దగ్గు, జలుబులాగా కరోనా కూడా వచ్చిపోతుందని చెప్పారు.ఇతర వైరస్ లకు మానవ శరీరం ఏ విధంగా స్పందిస్తుందో కరోనాకు కూడా అదే తరహాలో స్పందించే అవకాశం ఉందని చెప్పారు.

TeluguStop.com - కరోనా మళ్లీమళ్లీ సోకుతుందంటున్న బ్రిటన్ శాస్త్రవేత్తలు..-General-Telugu-Telugu Tollywood Photo Image

దాదాపు మూడున్నర లక్షల మంది యాంటీబాడీ పరీక్షల ఫలితాలను పరిశీరించి బార్క్ ‌లే ఈ విషయాన్ని వెల్లడించారు.75 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారిలో యాంటీబాడీలు త్వరగా తగ్గిపోతాయని.కరోనా నిర్ధారణ అయిన వాళ్లకు గడిచిన నాలుగు నెలల్లో 26 శాతం యాంటీబాడీలు తగ్గినట్టు గుర్తించామని తెలిపారు.లక్షణాలు బయటపడని వారిలో 60 శాతం యాంటీబాడీలు తగ్గిపోయాయని తెలిపారు.
మరోవైపు శాస్త్రవేత్తలు చేస్తున్న ప్రయోగాలు కరోనా నుంచి కోలుకున్న వారిలోని యాంటీబాడీలు ఇతర ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయని.అయితే ఈ అంశం గురించి మరిన్ని పరిశోధనలు జరగాల్సి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చేంత వరకు తగిన జాగ్రత్తలు తీసుకోవడం మినహా మరే మార్గం లేదని చెబుతున్నారు.ప్రస్తుతం 100 మందికి కరోనా సోకితే ఇద్దరు నుంచి ముగ్గురు చనిపోతున్నట్టు శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

#Cough #Corona Virus #Cold #Corona Vaccine #Corona Symptoms

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Will Remain As A Seasonal Infection Related Telugu News,Photos/Pics,Images..