కోహ్లీకి గుండు చేస్తానంటున్న వార్నర్  

Corona Virusaustralian Cricketer David Warner Virat Kohili - Telugu Corona Virus, David Warner, Shave Head, Virat Kohli, Weird News

ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ కారణంగా దాదాపు అన్ని దేశాల్లో లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే.ఈ వైరస్ బారిన పడ్డవారికి వైద్యులు నిత్యం వైద్యసేవలు అందిస్తున్నారు.

 Corona Virusaustralian Cricketer David Warner Virat Kohili

కాగా ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలకుండా సేవలందిస్తున్న పోలీసులు, వైద్యులు, పారిశుద్య కార్మికులు, పారామెడికల్ సిబ్బంది, నర్సులకు ప్రపంచవ్యాప్తంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

ఈ క్రమంలో ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ వారి సేవలను కీర్తిస్తూ గుండు గీసుకున్నాడు.

కోహ్లీకి గుండు చేస్తానంటున్న వార్నర్-General-Telugu-Telugu Tollywood Photo Image

తానే సొంతంగా గుండు గీసుకుంటూ తీసిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.ప్రపంచంలోని ఇతర క్రీడాకారులు కూడా ఈ ఛాలెంజ్‌ను స్వీకరించాలని కోరాడు.కరోనా వైరస్ కోసం తమ కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజా సేవలో ఉన్న వారందరికీ తాను రుణపడి ఉంటానని ఈ సందర్భంగా వార్నర్ తెలిపాడు.

కాగా వార్నర్ గుండు చేసుకుని భారత క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ విరాట్ కోహ్లి, ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్‌తో పాటు మరో ఏడుగురికి ఈ ఛాలెంజ్ విసిరాడు.

అయితే కోహ్లీ ఎప్పుడు తన హెయిర్ కట్‌ను చాలా స్టైలిష్‌గా ఉండేలా చూసుకుంటాడు.మరి వార్నర్ విసిరిన ఛాలెంజ్‌కు ఆయన ఒప్పుకుంటాడా లేడా అనేది సందేహంగా మారిందని క్రీడాభిమానులు అంటున్నారు.