కరోనా అలర్ట్‌ : వేప చెట్టు, బెల్లంఅల్లం పుకార్లు నమ్మడం తప్పు, కాని ఇలాంటి పుకార్లు నమ్మినా తప్పేం లేదు  

Corona Virus Wuhan Allam Bellam Social Media Voice Messages Indian Student Covid 19 -

కరోనా నేపథ్యంలో సోషల్‌ మీడియాలో వస్తున్న పుకార్లు అన్నీ ఇన్నీ కావు.ఈ వైరస్‌ భయం కొంత అయితే ఆ పుకార్లు మరింతగా భయపెడుతున్నాయి.

 Corona Virus Wuhan Allam Bellam Social Media Voice Messages Indian Student Covid 19

ఆమద్య ఒక డాక్టర్‌ జర్నలిస్టు మాట్లాడుకున్న వాయిస్‌ మెసేజ్‌ కొందరికి నిద్ర కూడా లేకుండా చేసిన విషయం తెల్సిందే.అవి పుకార్లే అని ఎంత మంది చెబుతున్నా కూడా కొందరు మాత్రం వాటిని భయపడుతూనే ఉన్నారు.

పుకార్లు ప్రచారం చేయవద్దంటూ ఎంతగా విజ్ఞప్తి చేసినా, హెచ్చరించినా కూడా కొందరు ఆకతాయిలు మాత్రం పుకార్లను పుట్టిస్తూనే ఉన్నారు.

కరోనా అలర్ట్‌ : వేప చెట్టు, బెల్లంఅల్లం పుకార్లు నమ్మడం తప్పు, కాని ఇలాంటి పుకార్లు నమ్మినా తప్పేం లేదు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కరోనా ఆందోళన ప్రారంభం అయిన తర్వాత ఎన్నో పుకార్లు వచ్చాయి.

అందులో ముఖ్యంగా ఒక్క కొడుకు ఉన్న వారు వేప చెట్టుకున నీళ్లు పోయాలి లేదంటే కరోనా వస్తుంది అంటూ ప్రచారం జరిగింది.దాంతో రెండు రోజులు ఎక్కడ వేప చెట్టు కనిపిస్తే అక్కడ జనాలు నీళ్లు పోయడం ప్రారంభించారు.

ఇక పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఒక అయ్యగారి ఒంటిమీదకు వచ్చి బెల్లం అల్లం మిశ్రమంను తాగాలని చెప్పి చనిపోయాడు.దాంతో బెల్లం అ్లం ద్రవం తాగిన వారు లక్షల్లో ఉన్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇక తిరుమల శ్రీవారి ఆలయంలో అఖండ జ్యోతి కొండెక్కిందని, దాంతో అరిష్టం అంటూ ఆడవారు అంతా కూడా పసుపుకొమ్ము కట్టుకున్నారు.ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పుకార్లు వచ్చాయి.

ఈ పుకార్ల స్థాయిలోనే జనాలు భయపడొద్దని, బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండాలని ప్రభుత్వం ప్రచారం చేస్తూనే ఉంది.కాని ఈ సిల్లీ పుకార్లను నమ్ముతూ ఫాలో అవుతున్నారు తప్ప ప్రభుత్వం చెప్పినవి ఫాలో అవ్వడం లేదు.

ఇప్పుడు సోషల్‌ మీడియాలో ఒక వాయిస్‌ మెసేజ్‌ ప్రముఖంగా ప్రచారం జరుగుతోంది.ఆ వాయిస్‌ మెసేజ్‌లో ఒక ఇండియన్‌ స్టూడెంట్‌ ప్రస్తుతం వూహాన్‌లో ఉన్నాడు.అక్కడి పరిస్థితిని అతడు చెప్పాడు అంటూ ఆ వాయిస్‌ మెసేజ్‌ ప్రచారం జరుగుతోంది.

ఆ వాయిస్‌ మెసేజ్‌లో వూహాన్‌లో ఇంకా కూడా కరోనా కేసులు వేలల్లోనే నమోదు అవుతున్నాయి.

కాని అక్కడి వారు మాత్రమే కాకుండా చైనా మొత్తం కూడా ఇప్పుడు ప్రతి రోజు నాలుగు సార్లు వేడి నీటితో నోరు పుక్కిలించడం, రెండు మూడు సార్లు ఆవిరి పట్టడం చేస్తున్నారట.దాంతో పాటు చిన్న చిన్న చికిత్స తీసుకుంటున్నారు.

దాంతో కరోనా పాజిటివ్‌ వచ్చినా కూడా ఈ ఇంటి చికిత్సతో నాలుగు అయిదు రోజుల్లోనే ఆ వైరస్‌ పోతుందట.ఇండియాలో కూడా ప్రతి ఒక్కరు ఇలా చేయాలి.

వైరస్‌ ఉన్న వారు లేని వారు ప్రతి ఒక్కరు కూడా ఇలా నోటిలో వేడి నీరు పోసుకోవాలని ఇది దేశ ప్రజలందరికి తెలియజేయండి అంటూ ఊరు పేరు లేని వ్యక్తి వాయిస్‌ మెసేజ్‌లో చెప్పాడు.ఇది కూడా నిజం కాకపోవచ్చు.

కాని ఇది పాటిస్తే మంచిదే అని వైధ్యులు కూడా అంటున్నారు.కనుక పిచ్చి పుకార్లు నమ్మి పాటించే బదులు ఇలాంటి మంచి పుకారును నమ్మి పాటించాలంటూ ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తున్నాను.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు