కరోనా కు చెక్, అక్కడ సక్సెస్ అవుతున్న ప్లాస్మా థెరపీ

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ వల్ల ఇప్పటికే 82 వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.దీనికి మందులేకపోవడమే ఇంత భారీ స్థాయిలో మరణాలు నమోదు అవుతున్నాయి.

 Two South Koreans Recover From Covid-19 After Plasma Therapy. Corona Virus, Worl-TeluguStop.com

ఈ వైరస్ కు ఎలాంటి మందు లేకపోవడం తో ప్రస్తుతం మలేరియా,ఎయిడ్స్ పేషేంట్ లకు ఉపయోగించే మందులను ఉపయోగించే కరోనా ను కట్టడి చేయాలి అని ప్రపంచ దేశాలు ప్రయత్నాలు చేస్తున్నాయి.మరోపక్క ఈ వైరస్ కు వాక్సిన్ ను కూడా కనిపెట్టాలని ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు కూడా జరుపుతున్నాయి.

ప్రపంచ దేశాలు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ కరోనా మృత్యుఘోష మాత్రం ఆగడం లేదు.

అయితే తాజాగా కరోనా కు చెక్ పెట్టడానికి గతంలో పాటించే ప్లాస్మా థెరపీ సత్ఫాలితాలు ఇస్తుంది అంటూ కొందరు విశ్లేషకులు చెబుతుండడం తో దక్షిణ కొరియా పరిశోధకులు అదే పనిలో పడ్డారు.

అయితే ఈ పరిశోధనల్లో వారు సక్సెస్ అయినట్లు తెలుస్తుంది.వాళ్ళు నిర్వహించిన ప్లాస్మా థెరపీ సత్ఫలితాలను ఇస్తుందని దక్షిణ కొరియా పరిశోధకులు తాజాగా వెల్లడించారు.కరోనా లక్షణాల్లో ఒకటైన న్యూమోనియాతో బాధపడుతున్న ఇద్దరు వృద్ధులకు ప్లాస్మా థెరపీ చేయగా, వారిద్దరూ కోలుకున్నట్లు తెలుస్తుంది.తొలుత ఆ వృద్ధులకు మలేరియా, న్యూమోనియా, హెచ్ఐవీ మందులు ఇచ్చినప్పటికీ ఎలాంటి ప్రభావం చూపలేదు.

దీంతో వాళ్లకు ప్లాస్మా థెరపీ నిర్వహించగా సక్సెస్ అయినట్లు తెలుస్తుంది.ప్లాస్మా థెరపీ అంటే కరోనా బారినపడి కోలుకున్నవారి రక్తం నుంచి ప్లాస్మాను సేకరించి కరోనా తో బాధపడుతున్న వారి రక్తంలోకి ఎక్కిస్తారు.

కరోనా నుంచి కోలుకున్న వారి రక్తం లో కరోనా యాంటీబాడీస్ తయారై ఉంటాయి కాబట్టి, వాటిని సేకరించి కరోనా రోగుల రక్తంలో ప్రవేశపెట్టడం తో ఆ యాంటీబాడీస్ కరోనా వైరస్ తో పోరాడి వాటిని నాశనం చేస్తాయి.ఈ పద్ధతిద్వారా కరోనా కు చెక్ పెట్టొచ్చు అని దక్షిణకొరియా పరిశోధకులు చెబుతున్నారు.

అయితే ప్లాస్మా థెరపీపై మరిన్ని ప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందని దక్షిణ కొరియా పరిశోధకులు అంటున్నారు.ప్లాస్మా థెరపీ తో కరోనా కు చెక్ పెట్టడం సాధ్యమైతే ఒకరకంగా సక్సెస్ అయ్యినట్లే అని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube