నిబంధనలు ఎత్తేస్తే మరింత డేంజర్ అంటున్న WHO

ఒకపక్క ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా మహమ్మారి రోజు రోజుకు పెరుగుతున్న విషయం తెలిసిందే.దీనితో కొన్ని దేశాలు ఈ కరోనా ను కట్టడి చేయడం కోసం లాక్ డౌన్ ను కూడా ప్రకటించాయి.

 నిబంధనలు ఎత్తేస్తే మరింత డేం�-TeluguStop.com

భారత్ లో కూడా కరోనా కేసులు పెరుగుతుండడం తో అప్రమత్తమైన ప్రభుత్వం లాక్ డౌన్ ను ప్రకటించింది.అయితే 21 రోజుల లాక్ డౌన్ ప్రకటించగా ప్రస్తుతము ఈ లాక్ డౌన్ ను కొనసాగించాలా,లేదంటే ఎత్తివేయాలా అని ఆలోచన లో పడింది.

దీనితో కొన్ని నిబంధనలను సడలించి లాక్ డౌన్ ను దశలవారీగా ఎత్తివేయాలి అంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొనే సూచనలు కనిపిస్తున్నాయి.అయితే ఇలా కొన్ని నిబంధనలను ఎత్తివేయడం చాలా ప్రమాదకరం అవుతుంది అని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరిస్తుంది.

చైనా లో పురుడు పోసుకున్న ఈకరోనా వైరస్ ను కంట్రోల్ చేయడం కోసం ఆ దేశం 75 రోజుల పాటు లాక్ డౌన్ ను నిర్వహించింది.

దీనితో అక్కడ క్రమేణా కేసులు తగ్గుముఖం పట్టడం తో ఇటీవల లాక్ డౌన్ ను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది.

అయితే మిగతా దేశాలు కూడా అలానే సుదీర్ఘంగా లాక్ డౌన్ ను కొనసాగిస్తే ఫలితం ఉంటుంది అని మధ్య లో ఇలా నిబంధనలు సడలించి లాక్ డౌన్ ను కొనసాగిస్తే మరింత ప్రమాద కరం అంటూ WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ అన్నారు.ఇటలీ, జర్మనీ, స్పెయిన్, ఫ్రాన్స్‌లో క్రమంగా కరోనా వైరస్ కొత్త కేసులు తగ్గుతుండటం మంచి విషయమన్న టెడ్రోస్… ఇతర దేశాల్లో కరోనా వ్యాపిస్తోందనీ, ముఖ్యంగా ఆఫ్రికాలోని 16 దేశాల్లో అది ఒకరి నుంచి మరొకరికి పాకుతోందని హెచ్చరించింది.

ముఖ్యంగా ఆఫ్రికాలో వ్యాధి బారిన పడిన వారిలో హెల్త్ వర్కర్ల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.కొన్ని దేశాల్లో 10 శాతం దాకా వాళ్లున్నారు.ప్రస్తుతం ఆఫ్రికా ఖండంలో 13539 మందికి కరోనా ఉండగా… ఇప్పటికే 697 మంది చనిపోయారు.2237మంది రికవరీ అయ్యారు.ఆఫ్రికా దేశాల్లో కరోనా వైరస్‌పై తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే… అది భారీస్థాయిలో వ్యాపించే ప్రమాదం ఉందని WHO భావిస్తోంది.135 కోట్ల జనాభా ఉన్న ఇండియా ఈ వైరస్ వ్యాప్తిచెందకుండా సకాలంలో చర్యలు తీసుకోవడం తో ఇతర దేశాలతో పోల్చుకుంటే

భారత్ లో ఈ కరోనా కేసులు తక్కువగానే చెప్పుకోవాలి.ప్రపంచంలో అత్యధిక జనాబా కలిగిన దేశాల్లో భారత్ కూడా ఒకటి.అలాంటి ఇండియా లో ఈ కరోనా ప్రభావం అమెరికా,ఇటలీ,స్పెయిన్,ఫ్రాన్స్ వంటి దేశాలతో పోల్చుకుంటే తక్కువగానే ఉన్నట్లు తాజా నివేదిక ప్రకారం అర్ధం ఆవుతుంది.

అయితే ఈ లాక్ డౌన్ పొడిగించాలా లేదంటే ఎత్తివేయాలా అన్న దానిపై ఈ రోజు భారత ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రాల సీఎం లతో వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడి ఒక నిర్ణయం కు రానున్నట్లు తెలుస్తుంది.అనంతరం లాక్ డౌన్ పై కీలక ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube