జలుబు నుంచి కరోనా వచ్చిన వారికి గుడ్ న్యూస్!

గత కొన్ని నెలల నుండి కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తున్న విషయం అందరికి తెలిసిందే.ఇది శరీరంలో చేరగా కరోనా వైరస్ లక్షణాలు అయినా జలుబు, దగ్గు, తీవ్రమైన జ్వరం, గొంతు నొప్పి వంటి సమస్యలు ఎదురవుతాయి.

 Coronavirus With Cold Is A Severe One Corona Virus, Covid-19, Cold Symptom, Chi-TeluguStop.com

అయితే కరోనా వైరస్ జలుబు నుంచి వచ్చినట్లయితే పూర్తిగా జయించే అవకాశాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు.

ఈ విధంగా కరోనా వైరస్ కొన్ని రకాల లక్షణాలుగా ఉంటుందట.

ఇందులో ముఖ్యంగా కొన్ని జలుబును మరికొన్ని న్యూమోనియా ను  కలిగిస్తుంది.అయితే జలుబు నుంచి వచ్చిన కరోనా వైరస్ సోకిన వారికి కొవిడ్ తీవ్రత తక్కువగా ఉందని అమెరికాలో బోస్టన్ విశ్వ విద్యాలయం నిపుణులు తెలిపారు.

గత ఐదు సంవత్సరాల క్రిందట సీఆర్పీ- పీసీఆర్ పరీక్షలు చేయించుకున్న వారికి, ఈ ఏడాది కోవిడ్ పరీక్షలు చేయించుకున్న వారికి కరోనా జాతికి చెందిన వైరస్ ల మధ్య జన్యువులు ఒకేలా ఉన్నాయని.కోవిడ్-19 సోకినప్పుడు ఇవి రియాక్ట్ అయ్యే అవకాశం ఉందని తెలిసింది.కరోనా వైరస్ జలుబు నుంచి వచ్చిన వారు కోవిడ్ సోకిన కూడా దీని పరిణామం తక్కువగా ఉందని తెలిపారు.

వీరికి వెంటిలేటర్ కూడా తక్కువ అవసరం పడుతుందని, కరోనా ను ఎదుర్కొని జయించే శక్తి ఉందని వైద్యులు తెలిపారు.

ఒక్కటే స్థాయిలో వైరస్ సోకిన వారు మరణం పొందగా, మరికొంతమంది వైరస్ నుండి తిరిగి ఆరోగ్యంగా ఉండటానికి ఇదే కారణమని తెలిసింది.ఈ విధంగా కరోనా వైరస్ పరిశోధన వివరాలు జర్నల్ ఆఫ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్ పత్రికలో వెల్లడించారు.

కాగా చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనా బారిన పడి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు ఏకంగా 10 లక్షల మంది మృతిచెందరు.ఇప్పటివరకు మూడు కోట్ల 64 లక్షలమంది కరోనా వైరస్ భారిన పడగా అందులో రెండున్నర కోటి మంది కరోనా నుంచి కోలుకున్నారు.

మరో కోటి మంది కరోనా వైరస్ తో పోరాడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube