కరోనా ఆ జాతినే అంతం చేస్తుందట.. నిజమెంత?

దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి అడ్డూఅదుపు లేకుండా శరవేగంగా వ్యాప్తి చెందుతోంది.వైరస్ నియంత్రణ కోసం వ్యాక్సిన్ తయారీ కొరకు శరవేగంగా పరిశోధనలు జరుగుతున్నాయి.

 Corona Virus, Tribal People , Covid-19, Amazon Forest, Tribal People, Coronaviru-TeluguStop.com

సాధారణ జీవనం సాగించే వ్యక్తులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, వైద్యులు, నిపుణులు కరోనా గురించి అవగాహన కలిగేలా చేస్తారు.కానీ ఆదివాసీలకు మాత్రం ఈ వైరస్ గురించి కనీస అవగాహన ఉండదు.

వాళ్లు ఈ వైరస్ భారీన పడితే కొన్ని జాతులు, తెగలు అంతరించిపోతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

విక్టోరియా టాలీ కార్పజ్ తాజాగా కరోనా లాంటి వైరస్ లు కొన్ని తెగలను అదృశ్యం చేయగలవని అభిప్రాయపడ్డారు.

ఐక్యరాజ్యసమితి ప్ర‌తినిధి అయిన టాలీ కార్పజ్ 2,300 మంది ఆదివాసీ అమెరికన్లలో ఒకరు చనిపోయారని… ఆదివాసీలలో కరోనా ప్రభావం చూపుతుందని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అని అన్నారు.ఆదివాసీలలో పోషకాహార లోపంతో పాటు ఇతర వ్యాధులు ఉండటం వల్ల వాళ్లకు వైరస్ సంక్రమణ రేటు ఎక్కువగా ఉంటుందని తెలిపారు.

కరోనా వైరస్ ను ఎదుర్కోవడానికి తగినన్ని ఆస్పత్రులు, కావాల్సిన వైద్య సదూపాయాలు ఆదివాసీలకు అందుబాటులో లేవని… అమెజాన్ అటవీ ప్రాంతంలో నివశించే ఆదివాసీలు ఎక్కువగా కరోనా భారీన పడి మరణించారని చెప్పారు.పదిరోజుల క్రితం వరకు అమెజాన్‌లోని 38 ఆదివాసీ ప్రాంతాల‌ల్లో 19,329 మంది కరోనా సోకి మరణించారని… ఇప్పటివరకు అక్కడ 6,77,719 కరోనా కేసులు నమోదయ్యాయని ఆమె తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube