చైనాలోని వుహాన్ లో పురుడు పోసుకున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి.ఈ వైరస్ కి వ్యాక్సిన్ కనిపెట్ట పనిలో ఉన్నాయి పలు బయో ఫార్మా కంపెనీ లు.
చైనా దేశం కు చెందిన ఓ మూడు కంపెనీలు సినోవాక్ బయోటెక్ లిమిటెడ్, కాన్సినోబయో, సినోఫ్రాం గ్రూప్ కంపెనీలు కోవిడ్ వ్యాక్సిన్ అభివృద్దిపరుస్తున్నాయి.
జపాన్ కు చెందిన ఇంటెలిజన్స్ వార్తల ఆధారంగా ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కు, ఆయనతో పనిచేసే సీనియర్ అధికారులకు ఆయన కుటుంబ సభ్యులకు చైనా దేశంకు చెందిన ప్రయోగ కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చినట్లుగా ఉత్తరకొరియా వ్యవహారాల నిపుణుడు కజియానిస్ తెలిపాడు.కోవిడ్ వ్యాక్సిన్ చైనా దేశంకు చెందిన పది లక్షల మందికి అందజేసినట్లుగా సినోఫ్రామ్ తెలిపింది.