హై ' రిస్క్ ' చేస్తున్న కేటీఆర్ ? అసలు ట్విస్ట్ ఇదా ?

తెలంగాణ మంత్రి, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కొద్దిరోజులుగా జనాల్లో తిరుగుతూ హడావిడి చేస్తున్నారు.తెలంగాణలో కరోనా వైరస్ ప్రభావం తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న తరుణంలో నాయకులు రోడ్లపైకి వచ్చేందుకు వెనుకడుగు వేస్తున్నారు.

 Ktr Doing High Risk About Tour Of Telangana Corona Effected Areas  Telangana, Co-TeluguStop.com

కేవలం అధికారులతో సమీక్షలు చేసేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు.దీంతో కొద్ది రోజుల క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజాప్రతినిధులందరూ క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని సూచించారు.

ప్రజలకు సహకారం అందిస్తూ అధికారులతో సమన్వయం చేసుకుంటూ వైరస్ వ్యాప్తి చెందకుండా చూడాలంటూ ఆదేశాలు జారీ చేశారు.

అయినా ఇప్పటికీ రోడ్లపైకి వచ్చేందుకు ప్రజా ప్రతినిధులు భయపడుతూనే ఉన్నారు.

అయితే తెలంగాణలో హైరిస్క్ ప్రకటించిన కొన్ని ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటిస్తూ ప్రజలకు తగిన సూచనలు చేస్తున్నారు. అలాగే వలస కార్మికులు ఉన్న ప్రాంతాలకు వెళ్లి వారికి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.

ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు.కేటీఆర్ పర్యటిస్తున్న ప్రాంతాలన్నీ కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాలే.

కేవలం హైదరాబాద్ లోనే కాకుండా, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలోనూ కేటీఆర్ అదేవిధంగా పర్యటన చేస్తున్నారు.కష్ట కాలంలో ప్రతి ప్రజా ప్రతినిధులంతా, ప్రజలకు మరింతగా చేరువై సహాయ సహకారాలు అందించాలని కేటీఆర్ సూచనలు చేసిన విషయం తెలిసిందే.

కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా, ఆ ప్రాంతాల్లో స్వయంగా పర్యటిస్తూ కేటీఆర్ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. అయితే కేటీఆర్ ఇంత రిస్క్ చేయడానికి కారణాలు లేకపోలేదు.

Telugu Corona, Ktr Sirisilla, Telangana, Trs Ktr, Trs-Political

త్వరలోనే ఆయన తెలంగాణ సీఎంగా బాధ్యతలు స్వీకరిస్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటి నుంచి ప్రజల్లో తిరుగుతూ, ప్రజల మనిషిగా గుర్తింపు తెచ్చుకుని ఆ తరువాత ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాలనేది కేటీఆర్ ఆలోచనగా తెలుస్తోంది.అలా చేయడం ద్వారా ప్రజల్లోనూ పార్టీ నాయకుల నుంచి ఎటువంటి విమర్శలు రావు అనేది కేటీఆర్ ఆలోచనగా తెలుస్తోంది.ఏది ఏమైనా కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న సమయంలో కేటీఆర్ ధైర్యంగా హైరిస్క్ జోన్ ప్రాంతాలలో పర్యటిస్తూ, ప్రజలకు భరోసా కల్పించడం నిజంగా సాహసమనే చెప్పాలి.దీనిపై ప్రజలు, పార్టీ శ్రేణుల నుంచి సానుకూల అభిప్రాయం కేటీఆర్ పై ఏర్ పడుతున్నట్లుగా కనిపిస్తోంది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube