మీకు తెలుసా : ఇంట్లో ఉన్నా కరోనా వచ్చే అవకాశం ఉంది, ఈ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి

కరోనా మెల్ల మెల్లగా ప్రపంచ వ్యాప్తంగా పాకింది.దాదాపుగా రెండు వందల దేశాలకు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందింది.

 Corona Virus Tips Lockdown Safety Measures-TeluguStop.com

మన ఇండియా జనాభా ఎక్కువ కనుక మనం జాగ్రత్తలు తీసుకోకుంటే అత్యంత ప్రమాధకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావచ్చు.అందుకే ప్రతి ఒక్కరు కూడా స్వీయ నియంత్రణ పాటించడం వల్ల, ప్రతి ఒక్కరు కూడా వారికి వారు జాగ్రత్తలు పడటం వల్లే ఈ మహమ్మారి నుండి దూరంగా ఉండవచ్చు.

ఇంట్లోనే కూర్చుంటే కరోనా రాదని అంతా అనుకుంటున్నారు.కాని ఇంట్లోకి బయటి నుండి వచ్చే వస్తువుల ద్వారా కూడా కరోనా వచ్చే అవకాశం ఉందని వైధ్యులు హెచ్చరిస్తున్నారు.

నాలుగు గోడల మద్య ఉన్నా కూడా కరోనా చొచ్చుకు వచ్చేందుకు పలు మార్గాలు ఉన్నాయి.అవి ఏంటీ, వాటి నుండి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కరోనా ఏ రూపంలో వస్తుందో ఎవరు చెప్పలేరు.అందుకే బయట నుండి వచ్చే ప్రతి వస్తువును కూడా చాలా జాగ్రత్తగా శానిటైజ్‌ చేయాల్సిన అవసరం ఉంది.

Telugu Corona, Covid, Lockdown, Tips-General-Telugu

ప్రతి రోజు ఉదయానే వచ్చే పాల ప్యాకెట్స్‌, పేపర్‌ ఇంకా ఇతర వస్తువులను నేరుగా టచ్‌ చేయకుంటే బెటర్‌.పాలు తప్పనిసరి కనుక వాటిని కంటిన్యూ చేస్తూ పేపర్‌ను ఈ వారం రోజుల పాటు పూర్తిగా మానేయిస్తే బెటర్‌.
అత్యవసరం అయ్యి బయటకు వెళ్లిన సమయంలో ఎవరిని టచ్‌ చేయలేదు, ఎవరితో మాట్లాడలేదు అనుకోకుండా ఇంట్లోకి వచ్చి రాగానే పిల్లలను దగ్గరకు తీయకుండా చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.అసలు సబ్బుతో బాగా స్నానం చేయడం మంచిది.
కొరియర్స్‌ విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి.అవి ఎక్కడి ఎక్కడి నుండో వస్తాయి.

కనుక ఈ వారం రోజులు కొరియర్స్‌కు దూరంగా ఉండాలి.తప్పదు తీసుకోవాలి అంటే వచ్చిన కొరియర్‌పై శానిటైజర్‌ను బాగా స్ప్రే చేయాలి.
వృద్దులు మద్య వయస్కులు అందరు కూడా వాకింగ్‌ అంటూ బయటకు వెళ్లకుండా ఉండాలి.
గర్బిణీ స్త్రీలు హాస్పిటల్‌కు తప్ప మరెక్కడికి బయటకు వెళ్ల కూడదు.

వారు పూర్తిగా బెడ్‌ రెస్ట్‌ తీసుకోవాలి.ఎలాంటి వస్తువులను వారు టచ్‌ చేయకూడదు.

ఇతరులు వారిని టచ్‌ చేయకూడదు.వారు తీసుకునే పండ్లు చాలా శుభ్రంగా కడగాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube