సౌదీ రాజకుటుంబంలో ఏకంగా 150కి కరోనా  

Corona Virus Spreading Rapidly Among Saudi Royal Family - Telugu Corona Effect,, Covid-19, Lock Down

కరోనా కోరలు చాచి ప్రపంచం మొత్తం విస్తరిస్తుంది.ఇప్పటికే అగ్రరాజ్యం అమెరికాతో పాటు స్పెయిన్, ఇటలీ దేశాలలో విలయతాండవం చేస్తుంది.

 Corona Virus Spreading Rapidly Among Saudi Royal Family

ఇక అరబిక్ దేశాలలో కూడా కరోనా విపరీతంగా వ్యాపిస్తుంది.ఇండియాలో లాక్ డౌన్ కారణంగా కొంత వరకు నియంత్రించగలిగిన కూడా చిన్న చిన్న నిర్లక్ష్యాల కారణంగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య ఐదు వేలు దాటిపోయింది.

ఇక సౌదీ అరేబియాలో కూడా కరోనా బాధితుల సంఖ్య పెరిగిపోతుంది.సౌదీ అరేబియాలో రాజకుటుంబానికి చెందిన 150 మందికి కరోనా వైరస్ ఇన్ఫెక్షన్ సోకినట్లు తెలుస్తోంది.

ఆ కుటుంబంలో 150 మంది వైరస్‌ బారినపడినట్లు అమెరికాకు చెందిన న్యూయార్క్‌ టైమ్స్‌ వెల్లడించింది.రియాద్ గవర్నర్‌గా ఉన్న సౌదీ ప్రిన్స్ ఫైజల్ బిన్ బందర్ బిన్ అబ్దులాజిజ్ అల్ సౌద్‌కు కోవిడ్ సోకగా ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం.

రాయల్ ఫ్యామిలీ సభ్యులకు కోవిడ్ సోకడంతో కింగ్ ఫైజల్ స్పెషలిస్ట్ హాస్పిటల్‌లోని డాక్టర్లకు హాస్పిటల్ వర్గాలు హై అలర్ట్ జారీ చేశాయని న్యూయార్క్ టైమ్స్ తెలిపింది.రాజ కుటుంబంతో అత్యంత సన్నిహితంగా మెలిగే ఓ వ్యక్తి తమకు ఈ సమాచారం చెప్పారని తెలిపింది.

అయితే వైరస్‌ సోకిన వారి పేర్లను మాత్రం వెల్లడించలేదు.రాజకుటుంబంలోని వారికి వైరస్ సోకడంతో వారందరికీ ప్రత్యేకంగా చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Virus Spreading Rapidly Among Saudi Royal Family Related Telugu News,Photos/Pics,Images..