కరోనా వైరస్ గుట్టు విప్పే సాధనం : అమెరికా శాస్త్రవేత్తలు  

Corona virus, scavenger, hunt, American, scientists - Telugu American, Corona Virus, Hunt, Scavenger, Scientists

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది.ఇప్పటికే చాలా మంది ప్రాణాలను ఈ మహమ్మారి పొట్టన పెట్టుకుంది.

TeluguStop.com - Corona Virus Scavenger Hunt American Scientists

వైరస్ తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో అన్ని దేశాల శాస్త్రవేత్తలు కరోనా వైరస్ పై రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు.ఇప్పటికే కొన్ని దేశాలు వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చాయి.

క్లినికల్ ట్రయల్స్ చివరిదశకు కూడా చేరుకున్నాయి.యూఏఈ దేశంలో టీకాను కూడా అభివృద్ధి చేశారు.

TeluguStop.com - కరోనా వైరస్ గుట్టు విప్పే సాధనం : అమెరికా శాస్త్రవేత్తలు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

అయితే తాజాగా అమెరికాలోని నేషనల్ సెంటర్ ఫర్ అడ్వాన్సింగ్ ట్రాన్స్ లేషనల్ సైన్సెస్ (ఎన్ పీఏటీఎస్) శాస్త్రవేత్తలు ఓ సాధనాన్ని కనుగొన్నారు.

అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు ఓ చిన్న సాధనాన్ని కనుగొన్నారు.

ఇది మానవ శరీరంలో ప్రవేశించి కరోనా వైరస్ ఎలా ఇన్ఫెక్షన్ కలిగిస్తుందో కళ్లకు కట్టేలా చూపిస్తుంది.ఎస్ సీఏటీఎస్ శాస్త్రవేత్తలు తెలిపిన వివరాల ప్రకారం.

కరోనా వైరస్ పై ఉండే కొమ్ము ఆకృతిలో స్పైక్ ప్రొటీన్లు ఉంటాయన్నారు.ఇవి కణాల్లోని ఏసీఈ-2 అనే భాగానికి అతుక్కొని, ఇన్ఫెక్షన్ పెరుగుదలకు సాయపడుతుందన్నారు.

అయితే ఈ ప్రక్రియపై పరిశోధనలు జరిపేందుకు క్వాంటమ్ డాట్ అనే ఫ్లోరోసెంట్ నానో రేణువులను రూపొందించామని శాస్త్రవేత్తలు వెల్లడించారు.ఈ క్వాంటమ్ డాట్ తో వైరస్ మూలాలు కనుగొనే అవకాశాలు ఉంటాయని తెలిపారు.

వైరస్ మానవ శరీరంలో ప్రవేశించి కణానికి అతుక్కోవడం, వృద్ధి అయ్యే ప్రక్రియను పూర్తిగా పరిశోధించవచ్చన్నారు.వైరస్ మూలాలు తెలిస్తే ఈజీగా వైరస్ ను నిర్మూలించవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

ఈ సాధనంతో మైక్రోస్కోపు సాయంతో కరోనా వైరస్ ను క్షుణ్నంగా పరిశీలించవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.

#Scavenger #Scientists #American #Hunt #Corona Virus

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Virus Scavenger Hunt American Scientists Related Telugu News,Photos/Pics,Images..