కరోనా సోకి ప్రముఖ మాజీ క్రికెటర్ మృతి,ఎక్కడంటే

క‌రోనా మహమ్మారి ప్ర‌పంచ‌వ్యాప్తంగా మ‌నుషుల ప్రాణాల‌తో చెల‌గాటం ఆడుతున్న విషయం తెలిసిందే.దీని భారిన‌ప‌డి ఇప్ప‌టికే ప్రపంచ వ్యాప్తంగా 1 లక్ష 20 వేల మందికి పైగా మృత్యువాత పడగా, దాదాపు 10 లక్షల మందికి కరోనా సోకి చికిత్స పొందుతున్నారు.

 Former Pakistan Cricketer Zafar Sarfaraz Dies Due To Coronavirus In Peshawar, Co-TeluguStop.com

ఇప్పటికే ఈ కరోనా మహమ్మారికి ఎందరో ప్రముఖులు ప్రాణాలు కోల్పోగా తాజాగా ఒక ప్రముఖ మాజీ క్రికెటర్ కూడా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది.పొరుగుదేశం పాకిస్థాన్ కు చెందిన పాక్ మాజీ ఫస్ట్ క్లాస్ క్రికెటర్ జాఫర్ సర్ఫరాజ్(50) కోవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తుంది.

గత 3 రోజుల నుంచి సర్ఫరాజ్ పెషావర్ లోని ఒక హాస్పటల్ లో చికిత్స పొందుతున్న ఆయన మంగళవారం తుదిశ్వాస విడిచినట్లు తెలుస్తుంది.

ఇలా కరోనా తో మరణించిన తోలి పాక్ క్రికెటర్ గా జాఫర్ పేరు వెల్లడించారు.10 నెలల క్రితం క్యాన్సర్ పై పోరాడి ప్రాణాలు విడిచిన‌ పాక్ మాజీ ఆటగాడు అక్తర్ సర్ఫరాజ్ ఇతడికి సోదరుడు.1988లో క్రికెట్ కెరీర్ ప్రారంభించిన సర్ఫరాజ్.పెషావర్ తరఫున 15 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 616 ర‌న్స్ చేశాడు.6 వన్డేలాడి 96 ర‌న్స్ సాధించాడు.1994లో రిటైర్మెంట్ ప్ర‌క‌టించాడు.అనంతరం 2000 సంవత్సరంలో పెషావర్ కు చెందిన సీనియర్, అండర్-19 జట్లకు కోచ్ గాను సేవ‌లందించాడు.

ప్రస్తుతం పొరుగుదేశం పాకిస్థాన్ లో కూడా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం చేతులు ఎత్తేసింది కూడా.ఆ దేశ ఆర్ధిక వ్యవస్థ ఎంతగా దెబ్బతినింది అంటే ఇటీవల పీపీఈ లను అడుగుతున్నారు అన్న కారణంగా 50 మంది డాక్టర్ల ను అరెస్ట్ కూడా చేశారు.

ఇప్పటికే పాక్ లో 5,183 కరోనా కేసులు నమోదు కాగా.సుమారు 90 మంది కరోనా రోగులు మృతి చెందారు.ఇప్పటికే లాక్ డౌన్ల కారణంగా మా దేశం తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది అని అనేకమంది నిరుద్యోగులుగా మారారని, పరిశ్రమలు సైతం మూతబడడం తో ప్రజలు ఆకలి చావులకు గురయ్యే ప్రమాదం ఉందని ఇమ్రాన్ ఖాన్ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు.

ఐక్యరాజ్యసమితిలోని సేవా విభాగాలు, అంతర్జాతీయ ద్రవ్య నిధి వంటి సంస్థలు ఈ తరుణంలో మా మొర ఆలకించాలి అంటూ ఆయన కోరారు.

ఆరోగ్యం, సామాజిక రంగాల్లో మా వంటి వర్ధమాన దేశాలు తగినంతగా ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నాయని, రుణ మాఫీ చేయాలంటూ ఇమ్రాన్ విజ్ఞప్తి చేశారు.విదేశీ సంస్థలకు పాకిస్తాన్ ప్రభుత్వం 100 బిలియన్ డాలర్ల రుణాన్ని చెల్లించవలసి ఉండగా, ఇటీవలే కోటీ ఇరవై లక్షల మంది పేద కుటుంబాలకు ఆర్ధిక సాయం చేసేందుకు 900 మిలియన్ డాలర్లను వ్యయం చేసింది.

కరోనా రాకాసిని ఎదుర్కోవడానికి తమకు తగినన్నినిధులను మంజూరు చేయాలనీ, తమను ఆదుకోవాలని ఇమ్రాన్ ఖాన్ ప్రపంచ దేశాలను అభ్యర్థించారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube