హైదరాబాదులో కరోనా వైరస్ విజృంభించడానికి కారణం ఇదేనా…?  

Corona Virus No Symptoms - Telugu Corona Symptoms, Corona Virus, Hyderabad, No Symptoms Corona Effected Person, Police Academy

కరోనా వైరస్ గురించి ఇప్పుడు అందరికీ ఓ అవగాహన వచ్చేసింది.ముఖ్యంగా నగరవాసులకు ఈ విషయం పై పూర్తి అవగాహన వచ్చేసింది.

 Corona Virus No Symptoms

దీంతో నగరవాసులు మాస్కులు లేకుండా బయటికి రావడం అనేది లేకుండా పోయింది.అయినా సరే హైదరాబాద్, విజయవాడ, బొంబాయి, బెంగళూరు, చెన్నై వంటి మహానగరాలలో కొత్త కేసులు నిజంగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఇకపోతే హైదరాబాద్ మహానగరంలో కరోనా కు సంబంధించి కొత్త లక్షణాలు చాలామందికి ఆందోళనకు గురి చేస్తున్నాయి.

హైదరాబాదులో కరోనా వైరస్ విజృంభించడానికి కారణం ఇదేనా…-General-Telugu-Telugu Tollywood Photo Image

అసలు ఈ కొత్త లక్షణాల విషయానికి వస్తే.

ఓ వ్యక్తికి కరోనా సోకిన ఎటువంటి లక్షణాలు లేకపోవడమే కొత్త లక్షణం.ఇదే విషయం కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీలో ఏకంగా 180 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ జరిగింది.

అయితే కరోనా పాజిటివ్ వచ్చిన వీరిలో చాలా శాతం ఎవరికి కరోనా వైరస్ సోకిన లక్షణాలు లేకపోవడమే.ఇలాంటి లక్షణాలతో తాజాగా హైదరాబాద్ మహానగరంలో కరోనా వ్యాధి తీవ్రంగా కొనసాగుతోంది.

ఇటువంటి వారికి వైరస్ సోకిన సాధారణంగానే జీవనం కొనసాగిస్తుంటారు.దీంతో వారు బయటికి వచ్చి సగటు మనిషి లాగే అందరితో కలిసి తిరుగుతూ ఉంటారు.

ఈ పరిస్థితి నేపథ్యంలో కరోనా వ్యాప్తి మరింత వేగంగా వ్యాపిస్తోంది.

అయితే తాజాగా తెలంగాణ పోలీస్ అకాడమీ లో నమోదైన కరోనా వైరస్ కేసులలో 100 మంది శిక్షణ IAS లు ఉండగా, మరో 80 మంది అక్కడే పనిచేస్తోన్న స్టాఫ్ ఉన్నారు.

దీంతో అకాడమీ లోనే ఓ ఐసోలేషన్ ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు మీ పక్కవారికి కరోనా ఉండొచ్చు, ఉండకపోవచ్చు.కాబట్టి మీరు మాత్రం తగు జాగ్రత్తలు తీసుకోండి.లేకపోతే కరోనా మహమ్మారి మిమ్మల్ని కూడా చేరవచ్చు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test