మరో న్యూయార్క్ సిటీగా మారనున్న ముంబై నగరం...!

మహారాష్ట్రలో రోజు రోజుకు పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఈ లాక్ డౌన్ లోని 5 రోజులు కీలకం కానున్నాయి.ఈ 5 రోజుల్లో గనుక పరిస్థితులు తమ ఆధీనంలోకి తీసుకురాలేకపోతే ఇక ముంబై నగరం మరో న్యూయార్క్ సిటీ గా మారినా ఆశ్చర్య పడనవసరం లేదు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

 Next 5 Days Are Very Crucial For Maharashtra , Corona Virus, Mumbai, Maharastra,-TeluguStop.com

దీనికి ప్రధాన కారణం గత రెండు రోజుల్లో ఆ నగరంలో వందకు పైగా కరోనా కేసులు నమోదు కావడమేనట.ఒక వేళ పరిస్థితి ఇలానే కొనసాగితే మాత్రం ఆ రాష్ట్రం ప్రధానంగా ముంబై నగరం ఒక న్యూయార్క్ సిటీ గా మారినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు అని అంటున్నారు.

రాష్ట్రంలో ఇంచుమించు ప్రతిరోజూ వందకు పైగా కరోనా కేసులు నమోదు కావడం కనీవినీ ఎరుగనిదని ప్రభుత్వ, ఆరోగ్య శాఖ అధికారులు, ముంబై మున్సిపల్ కార్పొరేషన్ కూడా అంటోంది.అయితే ఈ క్రమంలోనే ధారావీ ప్రాంతంలో నివాసం ఉండే 7 లక్షల మందికి కూడా కరోనా టెస్ట్ లు నిర్వహించాలి అన్న యోచనలో మున్సిపల్ అధికారులు ఉన్నట్లు సమాచారం.

అయితే మరోపక్క వచ్ఛే వారం ఈ కేసుల సంఖ్య తగ్గవచ్ఛునని ఆశాభావం వ్యక్తం చేస్తున్న అధికారులు వచ్ఛే అయిదారు రోజుల్లో ముంబైలో 200 నుంచి 300 కేసులు నమోదయ్యే అవకాశం ఉందని కూడా అంటున్నారు.అయితే ఇలానే మరో 10 రోజులు గనుక కొనసాగితే ఈ సిటీ లేదా ఈ రాష్ట్రం మరో ఇటలీ లేక న్యూయార్క్ సిటీగా మారవచ్ఛునని ఒక అధికారి వ్యాఖ్యానించడం మరింత కలవరపెడుతుంది.

రెండు వారాల క్రితం వరకు కూడా ముంబైలో అతి తక్కువ కేసులు బయటపడ్డాయి.కానీ ఇటీవలి కాలంలో ఇవి హఠాత్తుగా పెరిగడం తో అధికారుల్లో ఆందోళన మొదలైంది.

మరోపక్క లాక్ డౌన్ సమయం కూడా మించి పోతుండడం తో ఎలాంటి చర్యలు చేపట్టాలో కూడా అర్ధం కానీ పరిస్థితుల్లో ఉంది.అంతేకాకుండా ఈ లాక్ డౌన్ గడువును మరి కొంత కాలం పొడిగించాలి అని కొన్ని రాష్ట్రాలు ప్రధానిని విజ్ఞప్తి కూడా చేసినట్లు తెలుస్తుంది.

మరి ఇంతగా ఎఫెక్ట్ అవుతున్న ముంబై లో ఈ లాక్ డౌన్ ను పొడిగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.ఇటీవల ఒడిశా లో లాక్ డౌన్ సమయాన్ని ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగిస్తున్నట్లు ఆ రాష్ట్ర సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే.

మరి మహారాష్ట్రలో కూడా శివసేన ప్రభుత్వం లాక్ డౌన్ ను పొడిగిస్తుందా అన్న విషయం తెలియాల్సి ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube