రాజదంపతులను కంగారు పెడుతున్న కరోనా,స్వీయ నిర్బంధం లోకి

కరోనా మహమ్మారి కి రాజు,పేద అన్న భేదం కూడా తెలియడం లేదు.వీరు,వారు అన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిని కూడా డేంజర్ లో పడేస్తుంది.

 Malasia's King And Queen Both Are Quarantined, Corona Virus, Malasiyan King, Sul-TeluguStop.com

తాజాగా మలేషియా రాజదంపతులకు సైతం ఈ కరోనా మహమ్మారి ప్రమాదం పొంచినట్లు కనిపిస్తుంది.దీనితో వారు క్వారంటైన్ లోకి వెళ్లినట్లు తెలుస్తుంది.

రాజసౌధానికి చెందిన ఏడుగురు ఉద్యోగులకు కరోనా పాజిటివ్ నమోదు కావడం తో రాజదంపతులు ద్దరూ కూడా ఐసోలేషన్ లో ఉన్నట్లు తెలుస్తుంది.సుల్తాన్ అబ్దుల్లా రియాతుద్దిన్‌, ఆయ‌న స‌తీమ‌ణి త‌న‌కు అజిహ అమినా మైమునా ఇస్కంద‌రియాలు రాజ భ‌వ‌నంలోనే వేరు వేరుగా జీవిస్తున్నారు.వారిద్ద‌రికీ కరోనా పరీక్షలు నిర్వహించగా నెగిటివ్ అని తేలినప్పటికీ ఈ వైర‌స్ గురించి జాగ్ర‌త్త‌లు పాటిస్తున్నారు.14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలోకి వెళ్లాల‌ని ఆ ఇద్ద‌రూ నిర్ణ‌యించుకున్నట్లు తెలుస్తుంది.క‌రోనా వైర‌స్ సోకిన ఏడుగురి ఉద్యోగుల ప‌రిస్థితి ప్ర‌స్తుతం నిల‌క‌డ‌గానే ఉన్నట్లు తెలుస్తుంది.ద‌క్షిణాసియాలో అత్య‌ధిక క‌రోనా కేసులు న‌మోదు అయిన దేశంగా మలేషియా నిలిచింది.ఆ దేశంలో ఇప్పటివరకు 21 మంది మృతిచెందగా,1796 మందికి క‌రోనా సోకినట్లు తెలుస్తుంది.ఈ కరోనా మహమ్మారి బకింగ్ హమ్ ప్యాలెస్ కు కూడా చేరినట్లు తెలుస్తుంది.

ప్రిన్స్ చార్లెస్(71) కు కరోనా వైరస్ పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ప్యాలెస్ వర్గాలు తెలిపాయి.అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ప్యాలెస్ వర్గాలు చెబుతున్నాయి.

ప్రిన్స్ చార్లెస్ భార్య 72 ఏళ్ళ డచెస్ ఆఫ్ కార్న్‌వాల్‌ కామిలాకు కూడా పరీక్షలు నిర్వహించారు.అయితే, ఆమెకు వైరస్ లక్షణాలు ఏమీ లేవని నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది.

బ్రిటన్ రాణి తన కుమారుడిని మార్చి 12న చివరిసారిగా కలిశారని అయితే ఆమె ఆరోగ్యంగానే ఉన్నట్లు ప్యాలెస్ తెలిపింది.ఆరోగ్య సంరక్షణ కోసం రాణి వైద్య సలహాలను పాటిస్తున్నట్లు స్పష్టం చేసింది.

క్లారెన్స్‌హౌస్ ఒక ప్రకటన విడుదల చేస్తూ ఆబర్డీన్‌షైర్‌లోని ఎన్‌హెచ్‌ఎస్ వారికి వైద్య పరీక్షలు నిర్వహించింది అని ప్రస్తుతం చార్లెస్, కామిలా ఇద్దరూ స్కాట్లండ్‌లోని బాల్మోరల్‌లో స్వీయ నిర్బంధంలో ఉన్నారని, యువరాజుకు ఎవరి నుంచి వైరస్ సోకి ఉంటుందన్నది చెప్పలేమని క్లారెన్స్ హౌస్ తెలిపింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube