సంచలనం: ఎయిర్ పోర్ట్ లో విధులు నిర్వహించిన 11 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లకు కరోనా

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ భారత్ లో కూడా విజృంభిస్తున్న విషయం తెలిసిందే.దేశవ్యాప్తంగా 3 వేలకు చేరువగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా,దాదాపు 68 మంది మృతిచెందిన విషయం తెలిసిందే.

 11 Cisf Jawans Posted At Mumbai Airport Test Positive For Covid-19, Corona Virus-TeluguStop.com

అయితే దేశంలో మహారాష్ట్రలోని ఎక్కువగా ఈ కరోనా కేసులు నమోదు అవుతుండడం తో అధికారులు ఆందోళన చెందుతున్నారు.ఇప్పటికే వరుస పాజిటివ్ కేసులు నమోదు అవుతూ తీవ్ర కలవరం రేపుతున్న ఈ సమయంలో మరో సంచలన వార్త వెలుగులోకి వచ్చింది.

కరోనా వైరస్ ఎయిర్ పోర్ట్ లో విధులు నిర్వహించిన 11 మంది సీఐఎస్ఎఫ్ జవాన్లకు పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తుంది.ముంబై విమానాశ్రయంలో విధులు నిర్వర్తించిన 11 మంది జవాన్ల కుకరోనా పాజిటివ్ వచ్చినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.

అయితే విమానాశ్రయంలో విదేశీ ప్రయాణికుల ద్వారానే ఈ వైరస్ వారికి సోకింది అంటూ అధికారులు చెబుతున్నారు.దీంతో మహారాష్ట్రలో కలకలం రేగింది.

ఇప్పటికే కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న సమయంలో ఇప్పుడు సీఐఎస్ఎఫ్ జవాన్లకు కరోనా వైరస్ సోకడంతో వారి ద్వారా మరికొందరికి సోకి ఉంటుందని అధికార యంత్రాంగం అనుమానం వ్యక్తం చేస్తుంది.అయితే ఈ కరోనా వైరస్ లాక్ డౌన్ విధించకముందే వారికి సోకి ఉంటుందని, ఎందుకంటే లాక్ డౌన్ విధించకముందు ముంబై విమానాశ్రయంలో విదేశీయులను విస్తృతంగా తనిఖీలు చేశారు.

ఆ సమయంలో ఈ జవాన్లు విధులు నిర్వహించడం వారికి ఈ వైరస్ అనేది సోకినట్లు అధికారులు భావిస్తున్నారు.

దీంతో ముందస్తు చర్యల్లో భాగంగా 142 మంది సీఐఎస్ ఎఫ్ జవాన్లను కొద్ది రోజులుగా క్వారంటైన్ లో ఉంచినట్లు తెలుస్తుంది.

వీరిలో మొదట నలుగురికి కరోనా వైరస్ పాజిటివ్ రాగా శుక్రవారం మరో ఏడుగురికి పాజిటివ్ అని తేలినట్లు సీఐఎస్ఎఫ్ ప్రకటించింది.మొత్తానికి ఈ వైరస్ అనేది భారత్ లో అంత ఎక్కువ ప్రభావం చూపదు అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా దేశంలో కరోనా కేసులు విపరీతమైపోయాయి.

ముఖ్యంగా ఢిల్లీ లో నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్ధనలు ఈ కరోనా పై మరింత ప్రభావం చూపినట్లు అర్ధం అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube