లాక్ డౌన్ నిబంధనలను ఉల్లఘిస్తే కాల్చి పాడేయండి, అధ్యక్షుడి ఆదేశాలు

ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటేర్టే సంచలన ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది.ఆయన అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసినప్పటి నుంచి కూడా సంచలన నిర్ణయాలు తీసుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తున్న రోడ్రిగో తాజాగా కరోనా నేపథ్యంలో సంచలన ఆదేశాలు జారీ చేశారు.

 Shoot Them Dead, Says Philippines President On Lockdown Violators, Corona Virus,-TeluguStop.com

కరోనా వైరస్ ప్రబలుతున్న వేళ లాక్ డౌన్ నిబంధనలను ఉల్లఘించిన వారిని సహించేది లేదని,అలాంటివారిని కాల్చి చంపేయండి అంటూ ఆ దేశ్ పోలీసులు,మిలటరీ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తుంది.ఫిలిప్పీన్స్ రాజధాని నగరమైన మనీలాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఫిలిప్ఫీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే టెలివిజన్ లో ప్రజలనుద్ధేశించి ప్రసంగించారు.

ఈ క్రమంలో లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిని కాల్చి చంపండి అంటూ ఆయన ఆదేశించారు.లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించడం, వైద్య కార్మికులను దూషించడం తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని ఆయన చెప్పారు.

దేశంలో ప్రతీ ఒక్కరూ ఇంటి నిర్బంధంలో ఉండి కరోనా వైరస్ ప్రబలకుండా సహకరించాలని కోరారు.ఫిలిప్పీన్స్ దేశంలో 2,311 మందికి కరోనా వైరస్ సోకగా, వారిలో 96 మంది మరణించినట్లు తెలుస్తుంది.

ప్రతీరోజూ వందల సంఖ్యలో కరోనా వైరస్ కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో సమస్య తీవ్రత దృష్ట్యా లాక్ డౌన్ అమలు చేయాలని అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టే కోరారు.కరోనా తీవ్రత దృష్ట్యా దేశాధ్యక్షుడు డ్యూటెర్టే తీవ్రంగా పరిగణించారని, ఈ తీవ్రతను తమ పోలీసులు అర్థం చేసుకున్నారని, అయితే అధ్యక్షుడు ఆదేశించినట్లు ఎవరినీ కాల్చవద్దని ఫిలిఫ్పీన్స్ పోలీసు చీఫ్ కోరారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube