2025లోగా 75% మంది వర్క్ ఫ్రమ్ హోం?

కరోనా వైరస్.ప్రస్తుతం ప్రపంచాన్ని చిగురుటాకులా వణికిస్తున్న వైరస్ కరోనా.

 Work From Home Will Continue After Lock Down Also  Corona Virus, Lock Down, Empl-TeluguStop.com

ఈ కరోనా వైరస్ రోజు రోజుకు పెరుగుతుంది తప్ప తగ్గటం లేదు.ఈ వైరస్ ని అంతం చెయ్యడానికి ప్రపంచ దేశాలు లాక్ డౌన్ అమలు చేస్తున్నాయి.

మన దేశంలో కూడా గత నెల రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతుంది.ఇంకా ఒక నెల రోజు పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయి.

ఇంకా లాక్ డౌన్ నేపథ్యంలోనే ప్రపంచంలో కంపెనీలు అన్ని కూడా ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అమలు చేస్తున్నాయి. లాక్ డౌన్ ముందు నుండే కంపెనీలు అన్ని కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అమలు చేస్తున్నాయ్.

దీంతో గత రెండు నెలల నుండి ఈ వర్క్ ఫ్రమ్ హోం అమలవుతుంది. ఇంకా ఈ నేపథ్యంలోనే 2025 లోగా వర్క్ ఫ్రమ్ హోం ఆప్షన్ ని 75 శాతానికి పెంచాలనే ఆలోచనలో ఓ కంపెనీ ఉన్నట్టు సమాచారం.

ఆ కంపెనీ ఏది అని అనుకుంటున్నారా? అదే అండి.ప్రముఖ ఐటీ కంపెనీ టీసీఎస్ కీలక నిర్ణయం తీసుకుంది అని సమాచారం… సాధారణంగా ఆ ఐటి కంపెనీ నుండి ఇప్పటికే ఇంటి నుండి 25 శాతం మంది విధులు నిర్వహిస్తున్నారు అని.2025లోగా దీనిని దశలవారీగా 75 శాతానికి పెంచాలనే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. ఏది ఏమైనా వర్క్ ఫ్రమ్ హోం ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube