హాస్పిటల్ నుంచి పరారైన తబ్లిగ్ జమాత్ కార్యకర్తలు

కరోనా వైరస్ దేశంలో ఒక వారం రోజుల క్రితం వరకు కంట్రోల్ లో ఉందని, ఇండియాలో దాని ప్రభావం ఉండబోదు అని అందరూ భావించారు.అయితే ఊహించని విధంగా ఢిల్లీలో మర్కజ్ మసీదులో ప్రార్ధనలకి హాజరైన వారిలో ఎక్కువ మందికి కరోనా వైరస్ వ్యాప్తి చెందింది.

 2 Tablighi Jamaat Attendees Escape From Quarantine Center, Corona Virus, Lock Do-TeluguStop.com

ఇక వారి నుంచి వారి కుటుంబ సభ్యులకి కూడా కరోనా వ్యాపించింది.తెలుగు రాష్ట్రాలలో మెజారిటీ కరోనా కేసులలో ఈ మర్కజ్ ప్రార్ధనలలో పాల్గొన్న తబ్లిగ్ జమాత్ కార్యకర్తలే ఉన్నారు.

ఇక వీరిని అన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలు గుర్తించి హాస్పిటల్ లో క్వారంటైన్ లో ఉంచారు.కొన్ని చోట్ల వీరిని క్వారంటైన్ కి తీసుకురావడానికి వెళ్తే దాడులు చేసారు.

కొన్ని చోట్ల సామూహిక ప్రార్ధనలు చేస్తున్నారు.దీంతో వీరిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

అయితే కరోనా రోజులకి మతం రంగు పులుముతున్నారని కొంత మంది షో కాల్డ్ సెక్యులర్ జనాలు విమర్శలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే క్వారంటైన్ కేంద్రంలో చికిత్స పొందుతున్న ఇద్దరు తబ్లిగ్ జమాత్ కార్యకర్తలు కిటికీ అద్దాలు పగలగొట్టి పరారయ్యారు.

ఉత్తరాఖండ్‌లోని కాశీపూర్‌లో ఈ ఘటన జరిగింది.ఢిల్లీలోని మర్కజ్ మజీదు సమావేశానికి వెళ్లొచ్చిన ఇద్దరు తబ్లిగ్ జమాత్ కార్యకర్తలను గుర్తించిన ఆరోగ్యశాఖ అధికారులు వారిని కాశీపూర్‌లోని క్వారంటైన్ కేంద్రానికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతున్న వారిద్దరూ నిన్న కేంద్రంలోని కిటికీ అద్దాలు పగలగొట్టి పరారయ్యారు.సమాచారం అందుకున్న పోలీసులు వారి కోసం గాలింపు మొదలుపెట్టారు.

మరోవైపు, వారు తప్పించుకున్న విషయం తెలిసి స్థానికులు ఆందోళన చెందుతున్నారు.ప్రభుత్వాలు స్వచ్చందంగా వారికి సర్వీస్ అందించే ప్రయత్నం చేస్తున్న ఈ తబ్లిగ్ జమాత్ కార్యకర్తలు మాత్రం చాలా చోట్ల మూర్ఖంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube