కేరళ రోడ్లపై ఎం తిరుగుతున్నాయి తెలుసా?

కరోనా వైరస్… ప్రపంచాన్ని ఎలా వణికిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రపంచవ్యాప్తంగా ఈ కరోనా భారిన 5 లక్షల మంది పడగ అందులో 24 వేలమంది మృతి చెందారు.

 Animal On Kerala Roads, Animals, Corona Virus, Kerala Streets, India Lock Down-TeluguStop.com

లక్ష 24 వేలమంది ఈ కరోనా బారి నుండి తప్పించుకున్నారు.ఇకపోతే ఈ కరోనా వైరస్ భారత్ లో కి ప్రవేశించి ప్రజలను బయాందోళనకు గురి చేసిన సంగతి విదితమే.

ఇంకా ఈ నేపథ్యంలోనే కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రించేందుకు 21 రోజుల పాటు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది.ఏప్రిల్ 14వ తేదీ వరుకు ఎవరు బయటకు రాకూడదు అని కేంద్రం ప్రకటించడంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు.

ఇంకా కేరళలో కూడా ఇదే పరిస్థితి ఎదురు కావడంతో ప్రజలంతా కూడా ఇళ్లకే పరిమితం అయ్యారు.రోడ్లపైకి ఒక్కరు కూడా రాలేదు.దీంతో రోడ్లు అన్ని కాలిగా ఉన్నాయి.ప్రజలు లేకపోవడంతో వన్యప్రాణులు ఎంతో ఆనందంగా రోడ్లపైకి తిరుగుతున్నాయి.

ఇప్పటికే ఓ అడవి దున్నపోతు ఎంతో ఆనందంగా తిరిగిన సంగతి తెలిసిందే.ఇంకా ఈ నేపథ్యంలోనే కేరళ రోడ్డుపైకి క్షీరద జాతికి చెందిన మలబార్‌ సివెట్ వచ్చింది.

సాధారణ రోజుల్లో అరుదుగా కనిపించే ఈ జంతువు.రోడ్లన్నీ ఖాళీగా ఉండటంతో వచ్చి స్వేచ్ఛగా సంచరించింది.

అలా తిరిగిన వీడియోను కొందరు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చెయ్యగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube