విడ్డూరం : కరోనా దేవుడి అవతారమట, రాకుండా ఉండాలంటే ఇలా చేయాలట

ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ చైనాలో ఇప్పటికే దాదాపుగా రెండు వేల మందిని బలి తీసుకుంది.దాదాపుగా లక్ష మంది కరోనా బాధితులు చైనాలో ఉండగా, ఇది ఇతర దేశాల్లో కూడా మెల్లగా ప్రాకుతోంది.

 Corona Virus Is An Avatar Of God We Must Pray To Corona Says A Swamy-TeluguStop.com

కరోనా వైరస్‌ వల్ల పెద్ద ఎత్తున జనాలు మృతి చెందబోతున్నట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు.ఇప్పటి వరకు కూడా దీనికి మందు కనిపెట్టలేదు.

కాని స్వామీజీలు మాత్రం మార్గం కనిపెడుతున్నారు.వారు చేస్తున్న వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

అఖిల భారత హిదూ మహాసభ జాతీయ అధ్యక్షుడు స్వామి చక్రపాణి చేసిన వ్యాఖ్యలు అందరు నోరు వెళ్లబెట్టేలా ఉన్నాయి.ఒక ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి మాట్లాడాల్సిన మాటలు కావంటూ కొందరు కామెంట్స్‌ చేస్తుంటే ఆయన చెప్పిందాంట్లో నిజముందని కొందరు అంటున్నారు.

ఆయన చెప్పినట్లు చేయడం వల్ల కరోనా నుండి మనం బయట పడవచ్చు అంటూ కొందరు నమ్ముతున్నారు.

Telugu Avatar God, Corona, Coronaavatar-

ఇంతకు ఆయన ఏం చెప్పాడో తెలుసా… కరోనా అనేది దేవుడి అవతారం, ఈ భూమి మీద ఉన్న జంతువులను కాపాడేందుకు వచ్చిన దైవావతారం.చైనాలో జరుగుతున్న జంతు బలిని ఆపేందుకు అక్కడి ప్రజలకు బుద్ది చెప్పేందుకు ఈ భూమి మీదకు దేవుడు కరోనా వైరస్‌ రూపంలో వచ్చాడు అంటున్నాడు.కరోనా వైరస్‌ నుండి ఇండియన్స్‌ కు ఎలాంటి ఇబ్బంది లేదు.

ఇక్కడ ఒక్కరంటే ఒక్కరు కూడా మృతి చెందరు అంటూ ఆయన నమ్మకంగా చెబుతున్నారు.

Telugu Avatar God, Corona, Coronaavatar-

మనం దైవారాధన ఎక్కువగా చేస్తాం.కనుక ఆ వైరస్‌ మనల్ని ఇబ్బందికి గురి చేయదంటూ చక్రపాణి చెబుతున్నాడు.కరోనా వైరస్‌ విగ్రహం ఏర్పాటు చేసి దానికి పూజలు చేయాలంటూ తన ఫాలోవర్స్‌కు పిలుపునిచ్చాడు.

ప్రతి ఒక్కరు కూడా కరోనాను దైవంతో సమానంగా పూజించడం వల్ల వారికి ఆ జబ్బు రాదు అంటూ ఆయన చెబుతున్నాడు.స్వామి చక్రపాణి చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయం ఏంటో మాకు తెలియజేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube