కన్నీరు పెట్టించే సంఘటనలు : ప్రపంచంలో ఇలాంటి దారుణ పరిస్థితి ఎవరికి రాకూడదు

కరోనా మిగులుస్తున్న కన్నీరు అన్నీ ఇన్నీ కావు.ప్రతి ఒక్కరిపై ప్రభావం పడేలా చేసిన ఈ

కరోనా మహమ్మారి

కొందరి జీవితాల్లో జీవితాంతం గుర్తుండి పోయే బాధను నింపేస్తోంది.

 People Not Attend There Friends And Family Members Funerals Because Of Coronavir-TeluguStop.com

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా లాక్‌ డౌన్‌ అమలులో ఉన్న కారణంగా ఎక్కడ ఎవరు చనిపోయినా కూడా వెళ్లే పరిస్థితి లేదు.కనీసం మోయడానికి నలుగురు మనుషులు కూడా దొరకని పరిస్థితి.

స్థానికులు అతడు మామూలుగా చనిపోయాడో కరోనాతో చనిపోయాడో అనే భయంతో కనీసం దగ్గరకు కూడా వచ్చే ధైర్యం చేయడం లేదు.ఎంతో మంది మరణం వచ్చినా పర్వాలేదు కాని ఇలాంటి పరిస్థితుల్లో మరణం రావద్దని కోరుకుంటున్నాం అంటూ ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు.

Telugu Corona Symptoms, Corona, Funerals, Helath, India Lock, Telugu-General-Tel

ఈ రెండు వారాల్లో దేశంలో కనిపించిన కొన్ని సంఘటనలు ప్రపంచంలో ఎవరికి రావద్దనిపించేలా ఉన్నాయి.ఈ సమయంలో చనిపోయిన కొందరి అంతిమ సంస్కారాలు కూడా సరిగా చేయలేని పరిస్థితి.ఒకప్పుడు బంధువు చనిపోయాడు అంటే ఎంత దూరంలో ఉన్నా, ఎంత పనిలో ఉన్నా కూడా వెళ్లే వాళ్లు.కాని ఇప్పుడు వెళ్లాలనుకున్నా వెళ్లే పరిస్థితి.చెప్పాలనుకున్నా బంధువులకు చెప్పలేని పరిస్థితి.అత్యంత దారుణమైన పరిస్థితులు కరోనా లాక్‌ డౌన్‌ కారణంగా ఉన్నాయి.

Telugu Corona Symptoms, Corona, Funerals, Helath, India Lock, Telugu-General-Tel

తెలుగు రాష్ట్రాల్లో ఈమద్య కాలంలో మృతి చెందిన కొందరికి అంత్య క్రియలు చేయడం కూడా కుటుంబ సభ్యులకు కష్టం అయ్యింది.ఎంతటి దుర్భర పరిస్థితి వచ్చిందని కుటుంబ సభ్యుడి మృతితో బాధపడుతున్న వారికి రెట్టింపు బాధను ఎవరు రాకపోవడం కలిగించింది.ఇక చివరి చూపును చూసుకోలేక పోయాం అంటూ మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు దగ్గరి వారు కూడా కన్నీరు మున్నీరు అయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.

Telugu Corona Symptoms, Corona, Funerals, Helath, India Lock, Telugu-General-Tel

ఇలాంటి సమయంలో ఆరోగ్యంగా మృతి చెందినా కూడా కరోనా భయంతో కొందరు దూరంగా ఉంటున్నారు.అధికారులు ఇంకా పోలీసులు ఆంక్షల మద్య దహన సంస్కారాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.మృతి చెందిన వ్యక్తి వద్దకు పదిమంది కంటే ఎక్కువగా వస్తే లాఠీ చార్జ్‌ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.

ఇంతటి విపత్కర పరిస్థితులు ప్రపంచంలో ఏ దేశంలో రాకూడదు.చివరకు మన శత్రువులకు ఇలాంటి పరిస్థితి రాకూడదు అంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube