దారుణం: లాక్‌డౌన్‌లో భారీగా పెరిగిన గృహ హింస!  

Corona Virus India Lock Down United Nations Domestic Violence United Nations Secrateroy General Antonia Guteriyas - Telugu Corona Virus, Domestic Violence, India Lock Down, United Nations, United Nations Secrateroy General Antonia Guteriyas

కరోనా వైరస్ నియంత్రణకై ప్రపంచ దేశాలు లాక్ డౌన్ విధించాయి… ఈ లాక్ డౌన్ కారణంగా సమాజంలో ఆరోగ్యంపై, ఇంటిపై శ్రద్ద పెరిగి కొన్ని మంచి మార్పులు జరిగితే మరోవైపు మహిళలపై గృహహింస దారుణంగా పెరిగింది.ఈ విషయాన్ని యునైటెడ్ నేషన్స్ గుర్తించి లాక్ డౌన్ సమయంలో ప్రపంచవ్యాప్తంగా మహిళలపై హింస దారుణంగా పెరిగింది అని.

 Corona Virus India Lock Down United Nations Domestic Violence United Nations Secrateroy General Antonia Guteriyas

వారి రక్షణకు తగిన చర్యలు తీసుకోవాలి అని యూనైటడ్ నేషన్స్ అన్ని దేశాలను కోరింది.

యునైటెడ్‌ నేషన్స్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ గృహ హింసపై మాట్లాడుతూ.

దారుణం: లాక్‌డౌన్‌లో భారీగా పెరిగిన గృహ హింస-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కేవలం యుద్ధభూమికి మాత్రమే హింస అనేది పరిమితం కాలేదని… సొంత ఇళ్లలోనే బాలికలు, మహిళలకు ముప్పు ఉందని వ్యాఖ్యలు చేశారు.ప్రజల్లో సామాజిక, ఆర్థిక ఒత్తిడితో పాటు భయం కూడా గత కొన్ని రోజుల నుంచి పెరిగిందని అన్నారు.

ఇదే తరుణంలో గత కొన్ని వారాల నుంచి గృహ హింసలో భయంకరమైన పెరుగుదలను తాము గుర్తించామని అన్నారు.ప్రభుత్వాలు కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం చర్యలు తీసుకుంటున్నాయని… అదే సమయంలో మహిళలపై హింసను అరికట్టడానికి కూడా చర్యలు చేపట్టాలని వీడియో ద్వారా సందేశం ఇచ్చారు.

ఇంకా ఇదే సమయంలో భారత్ లో లాక్ డౌన్ విధించిన తొలివారంలో సాధారణ రోజుల కంటే రెట్టింపు స్థాయిలో మహిళలపై గృహ హింస పెరిగినట్టు జాతీయ మహిళా కమిషన్ తెలిపింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Related Telugu News,Photos/Pics,Images..