నీళ్లల్లో కరోనా ఉంటుందా? స్పష్టం చేసిన డబ్ల్యూ హెచ్ వో

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ గాలిలో ఉండదు అన్న విషయాన్నీ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.అయితే తాజాగా నల్లా నీళ్లు తాగడం వల్ల ఈ మహమ్మారి వ్యాపిస్తుంది అంటూ సోషల్ మీడియా లో జరుగుతున్న ప్రచారం పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక స్పష్టత నిచ్చింది.

 Who Clarified No Evidence Of Coronavirus Spread Through Drinking Water, Corona V-TeluguStop.com

నల్లా నీళ్లు తాగడం వల్ల కరోనా వ్యాపిస్తుంది అంటూ వస్తున్న దుష్ప్రచారాలను ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) తిప్పికోట్టింది.ప్రపంచంలోని ఏ దేశ ప్రజలూ మంచినీటి విషయంలో ఆందోళన చెందొద్దని నీటి పైపుల ద్వారా కరోనా వైరస్ సంక్రమిస్తుందనడానికి శాస్త్రీయ ఆధారాల్లేవని తేల్చి చెప్పింది.

‘ప్రజలెవ్వరూ నల్లాల్లో వచ్చే నీరు తొగొద్దు.ఇతర పనులకు కూడా వినియోగించవద్దని.

ఇజ్రాయోల్ నుంచి సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం’ జరుగుతోంది.దీన్ని తీవ్రంగా తప్పు పట్టింది డబ్ల్యూహెచ్‌వో.

ఇజ్రాయోల్‌లో నమోదవుతున్న కరోనా పాజిటివ్ సంఖ్యకు, తాగునీటికి సంబంధం లేదని WHO ప్రతినిధి తారిఖ్ లాజరెవిచ్ వెల్లడించారు.అయితే ఈ వైరస్ అనేది గాలిలో ప్రయాణం చేసేంత తేలికపాటిది కాదని,నీటి ద్వారా కూడా ఈ వైరస్ అనేది వ్యాపించదు అని WHO స్పష్టం చేసింది.

కేవలం మనిషిని మరో మనిషి తాకడం, కరోనా వచ్చిన పేషంట్లు వాడిన వస్తువులను వాడటం, తాకడం ద్వారా ఈ వైరస్ వస్తుందే తప్ప, గాలి,నీరు ద్వారా ఈ వైరస్ వ్యాపించదు అని తెలిపింది.అలానే కరోనా వైరస్ ప్రబలుకుండా ఉండాలంటే మనిషికి.

మనిషికి మధ్య మీటర్ దూరం ఉండాలని, ముఖ భాగాలను తాకకపోవడం వంటి చర్యల ద్వారానే కరోనా వైరస్‌ని నియంత్రించవచ్చు అంటూ WHO తెలిపింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube