జూన్ వరకు అవన్నీ కూడా బంద్ చేయనున్న కేంద్రం

దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో ప్రబలుతున్న నేపథ్యంలో కేంద్రం 21 రోజుల పాటు లాక్ డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.దీనితో గతనెల నుంచి కొనసాగుతున్న ఈ లాక్ డౌన్ ఏప్రిల్ 14 వరకు కొనసాగనున్న సంగతి తెలిసిందే.

 India Planing To Continue The Lockdown For Malls And Schools , Corona Virus, Ind-TeluguStop.com

అయితే ఇటీవల ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ లింక్ లతో పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుండడం తో ఈ లాక్ డౌన్ ను మరింత పొడిగించాలి అంటూ కొన్ని రాష్ట్రాలు కేంద్రాన్ని కోరినట్లు తెలుస్తుంది.అయితే లాక్ డౌన్ ఎన్ని రోజుల పాటు పొడిగిస్తారు అన్న విషయాన్నీ పక్కన పెడితే లాక్ డౌన్ ఎత్తివేసినా,వేయకపోయినా విద్యాసంస్థలు,సినిమా థియేటర్లు,మాల్స్,సామూహిక మత ప్రార్ధనల పై మాత్రం ఈ లాక్ డౌన్ ను కొనసాగించాలి అని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.

Telugu Centralraj, Corona, Ministers, India Lock, Theaters, Schools Malls, Confe

కొన్ని రాష్ట్రాల్లో పెరుగుతోన్న కేసుల దృష్ట్యా లాక్ డౌన్ పొడిగించాలని కొన్ని రాష్ట్రాలు కోరుతుంటే.రెడ్ జోన్స్ ఏర్పాటు చేసి దశల వారిగా లాక్ డౌన్ ఎత్తివేయాలని మరికొన్ని రాష్ట్రాలు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలుస్తుంది.ఇదే విషయంపై తాజాగా కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆధ్వర్యంలో గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశమై చర్చించినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం దేశంలో ఉన్న పరిస్థితుల నేపథ్యంలో విద్యాసంస్థలు, సినిమా థియేటర్లు, మాల్స్, సాముహిక మత ప్రార్ధనలపై మే 15 లేదా జూన్ మొదటి వారం వరకు బంద్ విధించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ఈ ప్రాంతాల్లో ఎక్కువగా జనం గుమిగూడే అవకాశం ఉండటంతో కేంద్రం ఈ మేరకు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

అయితే కొన్ని రాష్ట్రాల్లో ఇంకా పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా.

వాటికి మినహాయింపు ఇవ్వాలా.లేక తుది నిర్ణయాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేయాలా అన్న దానిపై మాత్రం అధికారులు ఇంకా ఆలోచనలో పడినట్లు తెలుస్తుంది.

మరోవైపు నిన్న జరిగిన ఫ్లోర్ లీడర్ల వీడియో కాన్ఫరెన్స్ లో కూడా మోదీ సూచనప్రాయంగా పూర్తి లాక్ డౌన్ ఎత్తే ఛాన్స్ లేదని చెప్పినట్లు తెలుస్తోంది.దానికి తోడు ప్రధాని ఈనెల 11 వ తేదీన మరోసారి రాష్ట్రాల సీఎంలతో వీడియో కన్ఫారెన్స్ ద్వారా మాట్లాడనున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఈ అంశం పై చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube