కరోనా దారుణం: కన్న తల్లి శవాన్ని తీసుకెళ్లడానికి నిరాకరించిన కొడుకు

కరోనా మహమ్మారి భౌతిక దూరం పాటిస్తూ మనుషులకు దూరమౌతున్న విషయం తెలిసిందే.అయితే ఈ కరోనా వల్ల చాలా చోట్ల దారుణాలు చోటుచేసుకుంటున్నాయి.

 Scared Of Catching Coronavirus Infection, Son Refuses To Cremate Mother, Corona-TeluguStop.com

మనుషుల మధ్య భౌతిక దూరం పాటిస్తూ వస్తుండ గా ఇప్పుడు మరో అడుగు ముందుకేసి కన్న తల్లి కరోనా వల్ల చనిపోతే కనీసం శవాన్ని తీసుకెళ్లడానికి కూడా నిరాకరించాడు ఒక ప్రబుద్దుడు.ఈ ఘటన పంజాబ్ లోని లూథియానా లో చోటుచేసుకుంది.

షిమ్లాపురి గ్రామానికి చెందిన వృద్ధురాలు (69) కరోనా లక్షణాలతో మార్చి 31న ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు.అక్కడ చికిత్స పొందుతూ గత ఆదివారం ఆమె కరోనాతో మృతిచెందారు.

తల్లి చనిపోయిన విషయాన్ని వైద్యులు కొడుకుకు చెప్పారు.మృతదేహాన్ని తీసుకెళ్ళాలి అంటూ జిల్లా అధికారులు అతడికి కబురు చేయగా ఆ కన్న కొడుకు నిరాకరించాడు.తనను నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లి మృతదేహాన్ని ముట్టుకుంటే తనకూ, తన కుటుంబ సభ్యులకు ఎక్కడ కరోనా సోకుతుందనే భయంతో తల్లి శవాన్ని కూడా ముట్టుకోవడానికి నిరాకరించాడు.ఈ విషయమై అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఇక్బాల్ సింగ్ మాట్లాడుతూ.

‘మృతదేహం నుంచి ఇన్ఫెక్షన్ సోకకుండా అవసరమైన రక్షణ కవచాన్ని కూడా ఇస్తామన్నా కూడా ఆ కన్న కొడుకు వినలేదని.ఆమె మృత దేహం చూడడానికి ఆమె కన్న కొడుకు కానీ, బంధువులు కానీ రాలేదని తెలిపారు.

ఈ విషయమై ఆమె కుటుంబ సభ్యులను అధికారులు రెండు సార్లు సంప్రదించినప్పటికీ వారు రాలేమని తెగేసి చెప్పడం తో చివరికి చేసేదేమీ లేక.నిన్న అర్ధరాత్రి జిల్లా అధికారులే అంత్యక్రియలను నిర్వహించినట్లు తెలుస్తుంది.

ఈ క్రమంలో మృతురాలి కుమారుడు, బంధువులు అంత్యక్రియలను 100 మీటర్ల దూరం లో నిలబడి వీక్షించినట్లు ఇక్బాల్ సింగ్ తెలిపారు.కరోనా వల్ల ఎంత దారుణం చోటుచేసుకుందో ఈ ఘటన ఉదంతం వింటే అర్ధం అవుతుంది.

నిజంగా కరోనా వల్ల కన్న కొడుకు కన్న తల్లి చివరి చూపు చూడడానికి నిరాకరించిన ఘటన అందరిని కలచివేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube