సీఎం సెక్యూరిటీలో కరోనా కలవరం

మహారాష్ట్ర సీఎం అధికారిక నివాసం అయిన మాతోశ్రీ వద్ద దాదాపుగా 150 మంది పోలీసులు భద్రతా సిబ్బంది విధులు నిర్వహిస్తూ ఉంటారు.ఇప్పుడు వారంతా కూడా కరోనా నేపథ్యంలో క్వారెంటైన్‌కు తరలించారు.

 Corona Virus Effect On Cm Security, Corona Virus, India Lock Down, Maharastra Cm-TeluguStop.com

వారికి ప్రస్తుతం వైధ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.వారిలో ఎవరైనా కరోనా పాజిటివ్‌ అని తేలుతుందా అనే ఆందోళన వ్యక్తం అవుతుంది.

సీఎం ఇంటి భద్రత సిబ్బందికి వైధ్య పరీక్షలు నిర్వహించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఆ ఇంటి సమయంలో ఒక చిన్న టీ స్టాల్‌ ఉంటుంది.ఆ టీ స్టాల్‌ నిర్వహకుడికి కరోనా పాజిటివ్‌ అని తేలింది.

కరోనా పాజిటివ్‌ అంటూ టీ స్టాల్‌ యజమానికి తేలడంతో అక్కడ టీ తాగే సీఎం ఇంటి భద్రత సిబ్బంది ఇంకా ఆయన కుటుంబ సభ్యులందరిని కూడా ప్రత్యేకమైన క్వారెంటైన్‌ కేంద్రాలకు పంపించడం జరిగింది.సీఎం ఇంటికి పూర్తిగా కొత్త సిబ్బందిని ఏర్పాటు చేసినట్లుగా మహారాష్ట్ర అధికారులు ప్రకటించారు.

ముఖ్యమంత్రి వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా ఆ టీస్టాల్‌లో గతంలో టీ తాగినట్లుగా గుర్తించారు.దాంతో వారిని కూడా క్వారెంటైన్‌కు తరలించారు.

సీఎం ఉద్దవ్‌ థాక్రేకు కూడా కరోనా పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube