దీపాలు వెలిగించమంటే,గాలిలో తుపాకీ తో కాల్చిన బీజేపీ నేత

దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు కొవ్వొత్తులు,దీపాలు,మొబైల్ టార్చ్ లైట్లు ద్వారా ఐక్యతా దీపాలని వెలిగించమని పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే.అయితే కేవలం దీపాలు వెలిగించి తమ ఐక్యత చూపించమంటే కొందరు మాత్రం అత్యుత్సహం దీపావళి టపాసులు కూడా కాల్చి విమర్శలు పొందారు.

 Bjp Women Leader Fires Pistol After Lighting Diyas In Uttarpradesh, Corona Virus-TeluguStop.com

అయితే ఉత్తర ప్రదేశ్ లోని ఒక బీజేపీ మహిళా నేత మాత్రం మరింత అత్యుత్సాహం ప్రదర్శించి గాలిలోకి తుపాకి తో కాల్పులు జరిపింది.బలరాం పూర్ జిల్లా బీజేపీ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు మంజు తివారీ తన సహచరులతో కలిసి,తుపాకీ తో గాలిలో కాల్పులు జరిపారు.

అయితే అంతటితో ఆగకుండా దీనికి సంబందించిన వీడియో ను సోషల్ మీడియా లో పోస్ట్ చేయడం తో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.బీజేపీ మహిళా నేత తీరు పట్ల నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

మరికొందరు ప్రజలు బాణాసంచా పేల్చారు.కొందరు కాగడాలతో ర్యాలీలు తీసి విమర్శల పాలయ్యారు.

తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది దీపాలు వెలిగించడం వదిలేసి బాణా సంచ కాల్చడం పై పలువురు ప్రముఖులు మండిపడ్డారు.

దీపాలు వెలిగించి ఐక్యత చాటాలని మోడీ గారు కోరితే చాలా మంది దీనిని ముందస్తు దీపావళి గా భావిస్తూ ఇలా టపాసులు కాల్చి విమర్శలు పొందుతున్నారు.

ఈ క్రమంలోనే టాలీవుడ్ హీరో మంచు మనోజ్ కూడా టపాసులు కాల్చిన వారిపై మండిపడ్డారు.బీజేపీ మహిళా నేత మంజు తివారీ అత్యుత్య్సహం ను చూసిన నెటిజన్లు కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

ఇంట్లో రాత్రి 9 గంట‌ల‌కు దీపాలు వెలిగించిన త‌ర్వాత ఆమె గ‌న్‌తో ఫైరింగ్ చేసింది.ఇక కాంగ్రెస్ నేత‌లు ఆ మ‌హిళా నేత‌పై కేసు పెట్టాల‌ని డిమాండ్ చేయడం తో పాటు ఆమెపై సీఎం యోగి చ‌ర్య‌లు తీసుకోవాలంటూ వారు కోరారు.

దీనితో స్థానిక పోలీసులు ఆమెపై కేసు న‌మోదు చేయాగా, త‌ప్పు జ‌రిగిపోయింద‌ని, మ‌రోసారి ఇలా చేయ‌ను అని ఆమె పోలీసులు ఎదుట వాంగ్మూలం ఇచ్చినట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube