ఇంత జరిగినా మార్పు లేకపోతే,పోలీస్ కేసు నమోదు

దేశంలో కరోనా కేసులు కొంచం సర్దుకుంటున్నాయి అన్న సమయంలో ఢిల్లీ నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్ధనల ఘటనతో దేశంలో ఒక్కసారిగా కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోయిన విషయం విదితమే.ఈ సామూహిక ప్రార్ధనలకు వెళ్లిన దాదాపు అందరికి కూడా కరోనా పాజిటివ్ రావడం తో దేశంలో కరోనా టెన్షన్ అనేది మొదలైంది.

 Corona Effect On Muslim's Jagneki Raat, Corona Virus, India Lock Down, Delhi Niz-TeluguStop.com

అయితే ఈ ఢిల్లీ మర్కజ్ ప్రార్ధన ఘటనల అనంతరం ఇక నుంచి అందరూ కూడా తమ ఇళ్లలోనే ప్రార్ధనలు చేసుకోవాలని సామూహిక ప్రార్ధనలు జరపవద్దు అంటూ ముస్లిం మతపెద్దలు ఫత్వా కూడా జారీ చేశారు.గురువారం రాత్రి జరుపుకోవాల్సిన జగ్నే కీ రాత్ (షబ్ ఎ బరాత్) ప్రార్థనలు సామూహికంగా జరుపుకోవద్దు అంటూ మత పెద్దలు పిలుపునిచ్చారు.

సామూహిక ప్రార్ధనల వల్ల కరోనా వ్యాప్తించే అవకాశం ఎక్కువ ఉంటుంది అని కావున ప్రతి ఒక్కరూ కూడా చేయాల్సిన జగ్నే కీ రాత్ ప్రార్థనలను తమ తమ ఇళ్లలోనే జరుపుకోవాలి అంటూ ముస్లిం మత పెద్దలు తమ మత ప్రజలకు విజ్ఞప్తి చేశారు.అలానే ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా సామూహిక ప్రార్ధనలు నిర్వహించరాదు అంటూ ముస్లింలకు పిలుపునిచ్చారు.

ఈ విషయంలో ప్రభుత్వ నిర్ణయాలను సహకరించాలని ఆయన కోరారు.సామాజిక దూరం పాటిస్తూ తమ తమ ఇళ్ళలోనే ప్రార్థనలు చేసుకోవాలని, గురువారం సాయంత్రం జరిగే షబ్ ఎ బరాత్ (జగ్నే కీ రాత్) జరుపుకోవడంలో ముస్లింలందరూ లాక్ డౌన్ నిబంధనలను దృష్టిలో ఉంచుకోవాలని ఆయన సూచించారు.

ఢిల్లీ ప్రార్ధనల ఘటనల తరువాతే తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక్కసారిగా కరోనా పాజిటివ్ కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి.దీనితో ఈ లాక్ డౌన్ ను మరి కొంత కాలం పొడిగించాలి అని తెలంగాణా సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోడీ ని కోరారు కూడా.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube