కరోనా కి తోడు కొత్త కష్టాలు ? ఇవే పెద్ద సవాల్ ?

కరోనా

నిజంగా కష్టాలని తీసుకువచ్చింది.ఆ దేశం ఈ దేశం అనే తేడా లేకుండా అన్ని దేశాలను అతలాకుతలం చేస్తూ ఇబ్బందుల పాలు చేస్తోంది.

 Corona Effect In Daily Wage Workers All State Borders Are Closed, Corona Virus,-TeluguStop.com

ఒకపక్క ఈ వైరస్ మరింతగా వ్యాప్తి చెందకుండా చేస్తూనే, దీనిని పూర్తిస్థాయిలో నిరోధించే విధంగా కఠిన నిబంధనలు అమలు చేసి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై పడింది.ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా

లాక్ డౌన్

నిబంధనలు కేంద్రం అమలు చేస్తోంది.

ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి కరోనా వ్యాప్తి చెందకుండా పూర్తిగా సరిహద్దులను మూసి వేయించింది.ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు పూర్తిగా రాకపోకలను కట్టడి చేసింది.

ఇక ప్రజలు కూడా ఇళ్ల నుంచి బయటకు రాకుండా చేయడంతో ఈ కరోనా మిగతా దేశాలతో పోలిస్తే భారత దేశంలో కాస్త అదుపులో ఉన్నట్టు కనిపిస్తోంది.

Telugu Corona, Wages, India Lock, India, Indian-Political

130 కోట్ల జనాభా ఉన్న భారత దేశంలో పరిస్థితి కాస్త మెరుగ్గా ఉన్నట్లుగా కనిపిస్తోంది.ఇదే సమయంలో అతి తక్కువ జనాభా ఉన్న దేశాల్లో మన దేశం కంటే ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది.

అమెరికా, బ్రిటన్, ఇటలీ

తదితర దేశాలు ఈ వైరస్ కారణంగా అతలాకుతలం అవుతున్నాయి.రోజు రోజుకు కేసుల సంఖ్య పెరగడంతో పాటు మరణాల శాతం కూడా పెరగడం ఆందోళన కలిగిస్తోంది.ఇక మన దేశం విషయానికి వస్తే ఈ ఎఫెక్ట్ కారణంగా వలస కూలీల పై ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది.

ఇతర రాష్ట్రాల్లో ఉపాధి పొందేందుకు వెళ్ళిన

కూలీలు

ఇప్పుడు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు.తమ సొంత రాష్ట్రాలకు వెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యాలు లేక తినేందుకు తిండి లేక అల్లాడుతున్నారు.

ఈ పరిస్థితుల్లో

కాలినడక

నే తమ రాష్ట్రాలకు వీరంతా బయల్దేరారు.ఈ సందర్భంగా పెద్దపెద్ద సమూహాలుగా సరిహద్దుల్లో వీరంతా చిక్కుకుపోయారు.

వారిని రాష్ట్రం దాటేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో వీరంతా దిక్కు మొక్కు లేనట్టుగా

చెక్ పోస్ట్

దగ్గర ఆగిపోయారు.దీని కారణంగా వారు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఇక విదేశీ మీడియా కూడా

భారత్

లో వలస కూలీల ఇబ్బందులను గురించి అనేక కథనాలను ఇచ్చింది.ఈ పరిస్థితుల్లో వీరి వ్యవహారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద సవాల్ గా మారింది.

పూర్తిగా తొలగిపోయే వరకు వారి ఆలనాపాలనా ప్రభుత్వాలు చూడాల్సిన పరిస్థితి నెలకొంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube