వైరల్‌ పోస్ట్‌ : జీవితంలో మళ్లీ ఇలాంటి రోజులు వద్దు దేవుడా.. కన్నీరు పెట్టిస్తున్న సోషల్‌ పోస్ట్‌

కరోనా విలయతాండవం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ప్రపంచ వ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 10 లక్షలకు చేరువలో ఉంది.

 A Social Media Viral Post About Corona Lock Down Time, Corona Virus, India Lock-TeluguStop.com

ఆ సంఖ్య వచ్చే నెలకు డబుల్‌ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ కొందరు ఆందోళనకర విషయాన్ని మరింత ఆందోళనగా చెబుతున్నారు.చైనాలో మొదలైన ఈ వైరస్‌ అమెరికా, ఇటలీ, స్పెయిన్‌ దేశాలను ఇప్పటికే దహించి వేసింది.

ప్రస్తుతం భారత్‌పై తీవ్ర ప్రభావం కనిపిస్తుంది.ఇండియాకు ఏప్రిల్‌ నె చాలా కీలకంగా మారింది.

లాక్‌డౌన్‌ అమలులో ఉన్నా కూడా నిజాముద్దీన్‌ ఘటన కారణంగా పెద్ద ఎత్తున పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యే ప్రమాధం ఉందని అంటున్నారు.

లాక్‌డౌన్‌ నేపథ్యంలో సామాన్యుల నుండి సెలబ్రెటీల వరకు ప్రతి ఒక్కరు కూడా ఎఫెక్ట్‌ అయ్యారు.

ఈ ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.ఈ సందర్బంలో ఒక సామాన్యుడు సోషల్‌ మీడియాలో చేసిన పోస్ట్‌ ప్రస్తుతం అందరిని కలిచి వేస్తుంది.

ఒక విధంగా చెప్పాలంటే అది అందరికి వర్తిస్తుంది.ప్రస్తుతం ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరి పరిస్థితికి ఆ పోస్ట్‌ అర్థం పడుతుంది అంటూ సోషల్‌ మీడియాలో ఆ పోస్ట్‌ వైరల్‌ అవుతోంది.

Telugu America, Corona, Covid, India Lock, Indian, Italy, Spain-General-Telugu

ఆ పోస్ట్‌లో ఏముందంటే.మొన్నటి వరకు జీవితం ఎంతో సాఫీగా సాగిపోయింది.ఉరుకుల పరుగుల జీవితం అంటూ అప్పుడప్పుడు విసుగు వచ్చినా కూడా పని చేసుకుంటూ హాయిగా రోజులను గడిపాను.ఇప్పుడు చేసేందుకు పని లేదు, ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి.

ఇంట్లో కూర్చోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు.కాని ఇంట్లో ఉన్న ప్రతి నిమిషం, ప్రతి గంట నా కుటుంబ పరిస్థితి ఏంటీ, రాబోయే రోజుల్లో నా కుటుంబ అవసరాలను ఎలా తీర్చాలి అనే టెన్షన్‌ నాలో ఉంది.

ఈ పరిస్థితుల్లో చిన్న పిల్లలు ఉన్న వారి పరిస్థితి తల్చుకుంటే ఆందోళనకరంగా ఉంది.వారికి కావాల్సిన నిత్యావసరాలు కూడా కొన్ని అందని పరిస్థితి ఉంది.

Telugu America, Corona, Covid, India Lock, Indian, Italy, Spain-General-Telugu

చిన్న పిల్లలు కొనివ్వమంటున్న చిన్న చిన్న తినుబండారాలు కూడా కొనివ్వలేని పరిస్థితి.వారికి పరిస్థితి అర్థం కాదు, బయటకు వెళ్దామని అల్లరి చేస్తూ ఉన్నారు.వారిని ఇంట్లో నాలుగు గోడల మద్య కూర్చో బెట్టి ఎంత అని ఉంచుతాం.కనీసం పక్కింటి వారితో కూడా ఆడుకోనివ్వకుండా వారిని ఉంచాల్సి వస్తుంది.పిల్లలకు ఈ ప్రభావం తీవ్రంగా పడుతుంది.ఇక పిల్లలు బయట తిరిగితే పోలీసులు కొట్టే వీడియోలు చూసి మరింతగా భయకంపితులు అవుతున్నారు.

వార్తల్లో కరోనా గురించి వస్తున్న న్యూస్‌ చూసి భయంతో వణికి పోతున్నారు.

ఈ సమయంలో కొన్ని పుకార్లు మమ్ములను తీవ్రంగా భయాందోళనకు గురి చేస్తున్నాయి.

ఏ వార్త నిజమో ఏ వార్త అబద్దమో కూడా తెలియని పరిస్థితి.అయినా కూడా ముందు ఉన్నవి మంచి రోజు అని కాలంతో పాటు సాగుతూ పోతున్నాం.

దేవుడు అనేవాడు ఉంటే మళ్లీ జీవితంలో ఇలాంటి రోజులు చూడకుండా చేయాలని కోరుకుంటున్నాను అంటూ పోస్ట్‌ చేశాడు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube