మీకు తెలుసా : వేలల్లో పెట్టుబడి పెట్టి లక్షల్లో సంపాదనకు టాప్‌ 4 వ్యాపారాలు

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా కోట్లల్లో నిరుద్యోగులు అయ్యారు.ఇక మన ఇండియాలో కూడా ఆ సంఖ్య లక్షల్లో ఉంది.ఇప్పటికే ఇండియాలో నిరుద్యోగుల సంఖ్య పెద్ద మొత్తంలో ఉంటుంది.వారి సంఖ్య భయంకరంగా పెరుగుతుంది.ఇలాంటి సమయంలో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేయకుండా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవాలంటూ నిపుణులు సూచిస్తున్నారు. కొందరు ఉద్యోగం కోసం సంవత్సరాల తరబడి చూస్తూ ఉంటారు కాని వ్యాపారం వైపు మొగ్గు చూపరు.

 Top 4 Business Ideas For Youth In India With Low Prize, Corona Virus, India, Bus-TeluguStop.com

వ్యాపారం అంటే లక్షలతో పని అనుకుంటారు.కాని మన ఇండియాలోనే చాలా మంది వేలల్లో పెట్టుబడి పెట్టి నెలకు కనీసం లక్ష రూపాయలు సంపాదించే వారు ఎంతో మంది ఉన్నారు.

ఇండియాలో తక్కువ పెట్టుబడితో సొంత వ్యాపారాల విషయం ఇప్పుడు చూద్దాం.

1.

పూల జడల తయారి:

చిన్న చిన్న ఫంక్షన్స్‌ నుండి పెద్ద ఫంక్షన్స్‌ వరకు పూల జడలు తప్పనిసరిగా అవసరం ఉంటాయి.పూల జడను బట్టి 500 నుండి 5000 రూపాయల వరకు ఉంటుంది.వారంలో నాలుగు అయిదు పూల జడల ఆర్డర్‌ వచ్చినా కూడా మంచి లాభాలు వస్తాయి.10 శాతం పెట్టుబడికి పోగా 90 శాతం మిగులుతాయని అంటున్నారు.కాస్త నైపుణ్యం అవసరం అవుతుంది.కాని సీజన్‌లో లక్షలు సంపాదించవచ్చు అంటూ ప్రస్తుతం ఈ వ్యాపారం నిర్వహిస్తున్న వారు అంటున్నారు.

Telugu Bussiness, Corona, Dall, Flowers, India, Pappers Plates-General-Telugu

2.పేపర్‌ పేట్ల తయారి :

ప్రస్తుతం ఎక్కడ ఏ చిన్న కార్యక్రమం జరిగినా విందుకు ఉపయోగించేది పేపర్‌ ప్లేట్లు.ఆ పేపర్‌ ప్లేట్లను తయారు చేయడం పెద్ద బ్రహ్మచోద్యం ఏమీ కాదు.దానికి ఒక చిన్న మిషన్‌ కావాలి.10 వేల రూపాయల ముడి సరుకుతో లక్ష రూపాయలకు ఎక్కువ విలువ చేసే పేపర్‌ ప్లేట్లను తయారు చేయవచ్చు.ఇద్దరు మనుషులు ఒక మిషన్‌ మీద నెలలో రెండున్నర నుండి మూడు లక్షల విలువ చేసే పేపర్‌ ప్లేట్లను తయారు చేయవచ్చు.మిషన్‌ ఖరీదు ఒక్క నెలలోనే వచ్చేస్తుంది. ఆ తర్వాత అంతా కూడా లాభాలే.మంచి మార్కెట్‌ను ఎంపిక చేసుకుని రెగ్యులర్‌గా ఆ పేపర్‌ ప్లేట్లను అమ్మినట్లయితే లాభాలు దక్కించుకోవచ్చు.

3.పప్పు పొట్టు తీసే మిషన్‌ :

ఇది పల్లెటూర్లలో బాగా వర్కౌట్‌ అవుతుంది. కందులు, పెసల్లతో పాటు పలు పప్పులకు పొట్టు తీసే మిషన్స్‌ ఈమద్య కాలంలో చాలా ఫేమస్‌ అవుతున్నాయి.

పొట్టు పప్పులను తినేందుకు ఆసక్తి చూపడం లేదు.కొనుగోలు చేసే కంటే పప్పులు చేయించుకుంటే బాగుంటుందని అంతా అనుకుంటున్నారు.కేజీకి అయిదు రూపాయల నుండి పది రూపాయల వరకు ఉంటుంది.దీంతో కూడా నెలకు లక్షల్లో సంపాదించవచ్చు.

Telugu Bussiness, Corona, Dall, Flowers, India, Pappers Plates-General-Telugu

4.మొబైల్‌ రెస్టారెంట్‌:

చిన్న చిన్న పట్టణాల్లో ఇంకా నగరాల్లో కూడా మొబైల్‌ రెస్టారెంట్‌ బిజినెస్‌లు యమ జోరుగా సాగుతున్నాయి.అయిదు లక్షల రూపాయలతో మొబైల్‌ రెస్టారెంట్‌ సెటప్‌ను చేసుకోవచ్చు.ప్రతి రోజు అయిదు వేల నుండి 20 వేల రూపాయల వరకు కూడా సంపాదించవచ్చు.మొబైల్‌ రెస్టారెంట్‌ గల్లీకి ఒకటి అయినా కూడా మంచి బిజినెస్‌ జరుగుతూనే ఉంది.అందుకే ఈ బిజినెస్‌ కూడా యువతకు మంచి క్రేజ్‌ ఉంది.

ఇలా చిన్న బడ్జెట్‌లతో పెద్ద బిజినెస్‌ చేయవచ్చు.కాని కొందరు మాత్రం ఉద్యోగమే చేస్తామంటూ ఉంటున్నారు.ఇలా కాస్త తెలివిగా ఆలోచిస్తే బాగుంటుంది.భవిష్యత్తు బాగుంటుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube