బిఎస్ఎఫ్, సిఆర్పీఎఫ్ లో ఏకంగా రెండు వేల మందికి కరోనా

కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది.అవకాశం దొరికిన ప్రతి చోటకి చొచ్చుకుపోతుంది.

 Corona Virus Impact On Bsf And Crpf, Corona Virus, Covid-19, Indian Army, Indian-TeluguStop.com

ప్రతి ఒక్కరి మీద ప్రభావం చూపిస్తుంది.ఇప్పటికే దేశ వ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య ఆరు లక్షలకి సమీపించేసింది.

దీనిని కంట్రోల్ చేయడంలో ప్రభుత్వాలు ఇప్పుడు కేవలం ప్రజల మీదనే భారం వేసాయి.అయితే వందకోట్లకి పైగా జనాభా అధికశాతం పేద, మధ్యతరగతి ప్రజలు ఉండే ఇండియాలో ప్రజలని కంట్రోల్ లో ఉండటం చాలా కష్టమైన పని.ఇదిలా ఉంటే ఇప్పుడు ప్రజలతో పాటు దేశ రక్షణంలో భాగస్వామ్యం అయ్యే జవాన్లు కూడా కరోనా మహమ్మారి బారిన పడ్డారు.బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్‌లలోని సిబ్బందికి పెద్ద ఎత్తున కరోనా సోకింది.

ఇప్పటి వరకు ఈ రెండు దళాల్లోని 2 వేల మందికిపైగా కరోనా బారినపడడం ప్రభుత్వాన్ని కలవరపరుస్తోంది.సీఆర్‌పీఎఫ్‌లో 1,219 మంది, బీఎస్ఎఫ్‌లో 1,018 మందికి కరోనా సోకినట్టు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.

లాక్ డౌన్ సడలింపు తర్వాత కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఇండియాలో ఏకంగా 4 లక్షల మంది కరోనా మహమ్మారి బారినపడడం ఆందోళన కలిగిస్తూ ఉండగా, వారిలో 60 శాతం మంది కోలుకోవడం ఊరటనిచ్చే అంశమని ప్రభుత్వం పేర్కొంది.ఇతర దేశాలతో పోల్చుకుంటే ఇండియాలో కరోనా మరణాల రేటు చాలా తక్కువగానే ఉందని చెప్పాలి.

ఇది ఏమైనా వేలినంత వేగంగా కరోనాని నియంత్రించే ప్రయత్నం చేయకపోతే లక్షల సంఖ్యలో ప్రజలు కరోనా బారిన పడే ప్రమాదం అయితే ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube