ఇంట్లో దొరికే వాటితో రోగనిరోధక శక్తిని ఇలా పెంచుకోండి...!

Corona Virus Immunity Power Vegetables Green Leafs Vaccine

గత ఏడు నెలల నుండి ప్రపంచం మొత్తాన్ని కరోనా వైరస్ ఏ విధంగా ఇబ్బంది పెడుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఈ నేపథ్యంలో కరోనాను అరికట్టేందుకు వ్యాక్సిన్ ను కనుగొనడానికి అనేక దేశ సైంటిస్టులు అహర్నిశలు పని చేస్తున్నారు.

 Corona Virus Immunity Power Vegetables Green Leafs Vaccine-TeluguStop.com

అయితే తాజాగా రష్యా దేశం మాత్రమే ఇప్పటి వరకు అధికారికంగా వ్యాక్సిన్ ను విడుదల చేసింది.ఇకపోతే వ్యాక్సిన్ ఇప్పట్లో మనదేశానికి వచ్చేలా కనబడట్లేదు.

కాబట్టి వీలైనంత వరకు భారతదేశంలో ప్రజలు సామాజిక దూరం పాటిస్తూ జీవనం కొనసాగించడం చాలా మంచిది.

 Corona Virus Immunity Power Vegetables Green Leafs Vaccine-ఇంట్లో దొరికే వాటితో రోగనిరోధక శక్తిని ఇలా పెంచుకోండి…-General-Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఒకవేళ తప్పని పరిస్థితుల్లో బయటికి వెళ్లి పనులు చేయాలన్న నేపథ్యంలో కచ్చితంగా మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవడం చాలా అవసరం.

ఇందుకోసం ఆస్పత్రుల చుట్టూ, మెడికల్ స్టోర్ ల చుట్టూ తిరిగే దానికంటే ఇంట్లో ఉండే  కొన్ని ఆహార పదార్థాలు తీసుకొని రోగ నిరోధకశక్తిని పెంచుకుంటే సరిపోతుంది.ఇక ఈ విషయం పరంగా ఆలోచిస్తే… మన ఇంట్లో ఉండే వెల్లుల్లి, అల్లం మరి కొన్ని కూరగాయల ద్వారా మన శరీరంలో రోగనిరోధక శక్తిని బాగా పెంచుకోవచ్చు.

ఇక ముఖ్యంగా వెల్లుల్లి తీసుకోవడం ద్వారా యాంటీ ఆక్సిడెంట్లను శరీరం లోకి ఎక్కువగా పొందవచ్చు.అంతే కాదు వీటి వలన ఏదైనా వ్యాధికి సంబంధించిన క్యాన్సర్లు మీద ఏ సమస్యలు ఉన్నా ఎదుర్కోగలవు.

ఇక అల్లం తీసుకోవడం ద్వారా కూడా మన శరీరంలో రోగ నిరోధక శక్తిని కొద్దిమేర పెంచుకోవచ్చును.వీటి ద్వారా ముఖ్యంగా చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు జబ్బులు వాటి బారిన పడకుండా ఇది అద్భుతంగా పని చేయగలదు.

ఇక అలాగే మనకు విరివిగా దొరికే క్యాబేజీలలో ఇమ్యూనిటీ పెంచే గుణాలు చాలానే ఉన్నాయి.ఇందులో గ్లుటమైన్ అనే పదార్థం బాగా లభిస్తుంది.

అలాగే ఆకుకూరలు, పాలకూర తీసుకోవడం ద్వారా మన శరీరానికి పీచు పదార్థం సమృద్ధిగా లభిస్తుంది.అంతేకాదు విటమిన్ సి, అలాగే కొన్ని యాక్సిడెంట్స్ కూడా పాలకూర ద్వారా లభిస్తాయి.

ఇలా కొన్ని పదార్థాలు మన శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.ముఖ్యంగా విటమిన్ సి, విటమిన్ డి ఎక్కువగా దొరికే ఆకుకూరలు, కూరగాయలు తీసుకోవడం శరీరానికి ప్రస్తుత కాలంలో చాలా అవసరం.

మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత యాక్టివ్ గా ఉండగలం.ఒకవేళ ఎవరైనా కరోనా వైరస్ సోకిన దాని నుండి త్వరగా కోలుకోవచ్చు.

#Green Leafs #Vegetables #Vaccine #Russia #COVID

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube