కరోనా పై కంగారు అవసరం లేదా ? ఆలస్యంగా గుర్తించారా ?

కరోనా వైరస్ ప్రభావం దేశంలో మొదలైనప్పుడు చెలరేగిన కంగారు అంతా కాదు.కరోనా సోకితే ప్రాణం పోతుంది అన్నంతగా జనాలు భావించే వారు.

 Icmr Guidelines, Icmr, Lockdown, Patients Discharge, Corona Positive-TeluguStop.com

ప్రభుత్వాలు ఆ విధంగానే అంచనా వేశాయి.అందుకే దేశవ్యాప్తంగా ఈ కరోనా వైరస్ విస్తరించకుండా లాక్ డౌన్ నిబంధనలు కఠినతరం అమలు చేశారు.

ఇప్పటికీ కొన్ని లాక్ డౌన్ నిబంధనలో సడలింపులు ఇచ్చినా, కఠినంగానే ఈ లాక్ డౌన్ అమలు చేస్తున్నారు.అయితే మొదట్లో కరోనా వైరస్ ప్రభావాన్ని తీసుకున్నంత సీరియస్ గా ఇప్పుడు ప్రభుత్వాలు, ప్రజలు, తీసుకోనట్టుగా కనిపిస్తున్నారు.

ఈ విషయంలో ఇండియన్ మెడికల్ రీసెర్చ్ కౌన్సిల్ ఆలోచనల్లోనూ మార్పు వస్తోంది.అంతకు ముందు విధంగా ఈ వైరస్ ప్రభావాన్ని అంత సీరియస్ గా తీసుకోవడం లేదు.

కానీ తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నిస్తోంది.

Telugu Corona, Icmr, Lockdown, Discharge-

అలాగే తాజాగా పేషెంట్లు డిశ్చార్జి పైనా, ఐసిఎం ఆర్ గైడ్ లైన్స్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.ఎవరికైనా కరోనా పాజిటివ్ వస్తే వారికి పది రోజుల్లో చికిత్స అందించి , వారం రోజులు హోమ్ ఐసోలేషన్ లో ఉంచితే సరిపోతుంది అని సూచించింది.కాకపోతే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి మాత్రం దీని నుంచి మినహాయింపు ఇచ్చింది.

కరోనా వైరస్ విషయంలో కాస్త ఎక్కువగా భయపడ్డామని , దేశాన్ని బయ పెట్టాము అనే అభిప్రాయం ఇప్పుడు కేంద్రంతో పాటు ఐసీఎంఆర్ వర్గాల్లోనూ కనిపిస్తోంది.తాజాగా కేంద్రం, ఐసీఎంఆర్ ఆదేశాలు చూస్తుంటే ఇదే అర్థం అవుతోంది.

Telugu Corona, Icmr, Lockdown, Discharge-

ఇప్పటివరకు కరోనా వైరస్ బాధితుడికి 14 రోజుల తర్వాత డాక్టర్లు రెండుసార్లు టెస్టులు చేసేవారు .రెండుసార్లు నెగిటివ్ వస్తేనే వారిని డిశ్చార్జ్ చేసేవారు.కానీ ఇప్పుడు లక్షణాలు లేక పోవడమే కాదు, పాజిటివ్ అని వచ్చిన వ్యక్తిని పది రోజులు ఆసుపత్రిలో ఉంచుకుని డిశ్చార్జి చేయాలని కేంద్రం చెబుతోంది.ఈ సందర్భంగా రోగులను మూడు కేటగిరీలుగా విభజించింది.

ఆ ప్రకారమే ఈ కొత్త విధానాన్ని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయాలని సూచించింది.సీరియస్ కండిషన్ లో ఉన్న పేషెంట్లు మాత్రమే డిశ్చార్జి ముందు పరీక్షలు నిర్వహించాలని, మిగతా వారికి అవసరం లేదన్నట్లుగా ఆదేశాలు జారీ చేసింది.

అలాగే చికిత్స సమయాన్ని కూడా పది రోజులకు కుదించింది.దీనిని బట్టి చూస్తే కరోనా విషయంలో ఇప్పటివరకు కేంద్రం కాస్త ఎక్కువగా కంగారు పడిందా అనే సందేహాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube