టాయిలెట్ ఫ్లష్ ద్వారా కూడా కరోనా......

ఈ కరోనా కొత్త పుంతలు తొక్కుతుంది.ఇప్పటివరకు సామాజిక దూరం పాటించాలి,మాస్క్ లు ధరించాలి,ఇంటి నుంచి బయటకు వెళ్ళకూడదు ఇలా ఒక్కొక్క షరతులతో ప్రతి ఒక్కరూ ఇళ్లకే పరిమితమైపోతున్నారు.

 Corona Virus Found In Bathroom Taps And Bathroom Hangers,toilet Flush, Masks , S-TeluguStop.com

అయితే ఇప్పుడు కొత్త విషయం ఒకటి వెలుగులోకి వచ్చింది.ఎదో ఇంట్లోనే ఉండిపోతే మనకు ఎలాంటి కరోనా రాదు అని అనుకున్నామో ఇక అంతే సంగతులు.

చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ చెందిన పరిశోధకులు చేసిన తాజా అధ్యయనంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి.ఖాళీ గా ఉన్న అపార్ట్ మెంట్ లోని సింక్,ట్యాప్,షవర్ హ్యాండిల్ పై అలానే టాయ్ లెట్ ఫ్లష్ ల ద్వారా కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు పరిశోధకులు వెల్లడించారు.

వారి అధ్యయనం ప్రకారం… గత కొద్దీ రోజులుగా ఖాళీ గా ఉంటున్న అపార్ట్ మెంట్ కింద ప్లాట్ వారు కరోనా బారిన పడ్డారు.అయితే వారం తరువాత ఖాళీ గా ఉన్న ఆ ఇంటిలో వైరస్ ఆనవాళ్ల ను గుర్తించడం గమనార్హం.

అయితే టాయ్ లెట్ ఫ్లష్ వేగానికి వైరస్ పైపుల ద్వారా లోపలి చేరినట్లు పరిశోధకులు భావిస్తున్నారు.అయితే దీనికి కారణం వైరస్ సోకిన వ్యక్తి మలం లో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

అందుకే ఇలా టాయ్ లెట్ ఫ్లష్ చేసినప్పుడు ఆ వేగానికి, గాలి ద్వారా కూడా ఇతర ఫ్లాట్ లకు ఆ వైరస్ చేరుతుంది అని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.

అందుకే బాత్ రూమ్ ల వాడకంలో అత్యంత జాగ్రత్త గా వ్యవహరించాలి అంటూ పరిశోధకులు చెబుతున్నారు.

అయితే ఆసుపత్రుల్లో ఇలాంటి ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అని, ఇతర కారణాల రీత్యా అంటే గాలి ద్వారా కూడా చాలా వేగంగా ఈ వైరస్ స్ప్రెడ్ అవుతున్నట్లు పరిశోధకులు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube