వామ్మో.. ప్రపంచంలో ప్రతి 10 మందిలో ఒకరికి ముప్పు!

దాదాపు 9 నెలల నుంచి కరోనా ప్రభావం వల్ల ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలం అయ్యాయి.ఇప్పటికీ రోజురోజుకీ కరోనా తీవ్రత అన్ని దేశాలలోనూ ఎక్కువగానే ఉంది.

 Who On Coronavirus Effects In People, Corona Virus, Covid-18, World Health Organ-TeluguStop.com

రోజు రోజుకి కేసుల తీవ్రత పెరుగుతుండడంతో పాటు మరణాల సంఖ్య కూడా అధికమవుతుంది.ఈ వైరస్ వ్యాక్సిన్ ను కనుగొనేందుకు ప్రపంచ దేశాలన్నీ ప్రయత్నిస్తున్నప్పటికీ ఇంతవరకు ఎలాంటి ఫలితం లభించలేదు.

వ్యాక్సిన్ కనుగొనే వరకు ప్రతి ఒక్కరూ సామాజిక దూరం పాటిస్తూ వారి కార్యకలాపాలను సాగించాలని అన్ని ప్రభుత్వాలు నిర్ణయించుకున్నాయి.

సోమవారం జరిగిన ప్రపంచ ఆరోగ్య ఉన్నత స్థాయి సమీక్షలో ఒక ఆసక్తికరమైన విషయం బయటపడింది.

ఇప్పటి వరకు అన్ని ప్రపంచ దేశాలలో ప్రతి 10 మంది జనాభాలో ఒకరు కరోనా వైరస్ తో బాధపడుతున్నారని, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఉన్నత స్థాయి అత్యవసర నిపుణుడు మైకేల్ ర్యాన్ చెప్పుకొచ్చారు.ఈ ఉన్నత స్థాయి సమీక్ష 34 మంది ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ సభ్యులతో సమావేశం నిర్వహించింది.

అయితే ఈ సమావేశం మన భారతదేశంలో జరగడం విశేషం.ఈ సమావేశం సందర్భంగా మైకిల్ ర్యాన్ మాట్లాడుతూ ప్రతి పది మందిలో ఒకరు కరోనా బారిన పడినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది అని తెలిపారు.

కరోనా వైరస్ ఇప్పటికీ విస్తృతంగా వ్యాప్తి జరుగుతుందని, పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో వాతావరణ పరిస్థితులను బట్టి ఈ వైరస్ వ్యాప్తి చెందుతుందని మైకెల్ ర్యాన్ తెలిపారు.అయితే ఇప్పటికి యూరోప్ దేశాలలో కరోనా తీవ్రతతో పాటు, మరణాల సంఖ్య కూడా అధికంగా ఉందని పేర్కొన్నారు.

కరోనాబారిన పడకుండా ప్రతిఒక్కరు తగు జాగ్రత్తలు పాటించాలని,కరోనా ముప్పు ఇంకా తగ్గలేదని పేర్కొన్నారు.మొదట కరోనావైరస్ ఎలా వ్యాపించిందని నిర్ధారణలో భాగంగా చైనా వెళ్లే నిపుణుల జాబితాను చైనాకు పంపినట్లు తెలిపారు.

అయితే ఉన్నత స్థాయి సమీక్ష సమావేశానికి భారత ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అధ్యక్షతన నిర్వహించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube