అమెరికా అధ్యక్ష పీటం పై ఎవరు…??? ట్రంప్ కొంప ముంచిన కరోనా…!!!!  

Corona Virus Donald Trump America Corona Virus Democratic Party Joe Bidden Ukraieen - Telugu America Corona Virus, Corona Virus, Democratic Party Joe Bidden, Donald Trump, Ukraieen

కుట్రలు లేవు కుతంత్రాలు లేవు.మిలియన్ డాలర్ల ఖర్చు లేదు, ఒకరిపై ఒకరు నిందించుకునే అవకాశమే లేదు.

 Corona Virus Donald Trump America Corona Virus Democratic Party Joe Bidden Ukraieen

రాజాకీయాలు అసలు లేనే లేవు.కానీ అమెరికా అధ్యక్ష పీటం మీద నుంచీ ట్రంప్ ఒక్క సారిగా కుప్ప కూలిపోనున్నారు.

ఇదే భవిష్యత్తులో జరగబోయే దృశ్యం.ఒక దేశాద్యక్షుడిని మార్చాలంటే అందులోనూ అగ్ర రాజ్య అధ్యక్షుడి ని మార్చాలంటే మాటలా.

అమెరికా అధ్యక్ష పీటం పై ఎవరు… ట్రంప్ కొంప ముంచిన కరోనా…-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కానీ కంటికి కనిపించని వైరస్ ఒక్క దెబ్బతో ట్రంప్ కల సౌధాన్ని చేరిపెయనుందట.విశ్లేషకుల విశ్లేషణ ప్రకారం వచ్చే ఎన్నికల్లో ట్రంప్ అధ్యక్షుడిగా ఓడిపోవడం ఖాయమనే అంటున్నారు.

ఆ వివరాలలోకి వెళ్తే.

ట్రంప్ తన ప్రత్యర్ధిని ఓడించడానికి ఉక్రెయిన్ ని ఉసిగొలిపి , తీవ్ర ఒత్తిడి చేసి నేరారోపణలు చేసి అందుకు గాను కొన్ని కోట్లాది రూపాయలు ఖర్చులు చేసి ఎట్టకేలకి ప్రజల ముందు బూచిగా చూపించాడు జో బిడెన్ అనే డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష రేసులో ఉన్న వ్యక్తిని.

కానీ ఒక వైరస్ కరోనా అని పిలువబడే వైరస్ ఇలాంటి తతంగాలు ఏమి చేయకుండా అధ్యక్షుడి కుర్చీ కింద నిప్పు పెట్టేసింది.

అమెరికాలో ఈ వైరస్ ఎంట్రీ ఇచ్చిన నాటి మొదలు ఇప్పటి దాకా కనికరం లేకుండా అందరిని కబళిస్తోంది.ఇప్పటి వరకూ 3500 మంది చనిపోగా , 1,77,000మందికి పైగా కరోనా పాజిటివ్ గా తేలింది.అయితే అగ్ర రాజ్యం అన్న మాటే గాని ఇక్కడ అరకొర సదుపాయాలతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు.

అంతేకాదు వైద్యులకి, నర్సులకి సరైన రక్షణ సదుపాయాలు కూడా లేవు.డ్యూటీలు చేస్తున్న పోలీసులకే కరోనా సోకడంతో పరిస్థితులు అన్నీ అల్లకల్లోలంగా మారిపోయాయి.ఇదిలాఉంటే.

ఇప్పటికే మాకు సదుపాయాలు కల్పించాలంటూ నర్సులు బహిరంగంగానే నిరసన వ్యక్తం చేస్తున్నారు.

అంతేకాదు మాకు కరోనా లక్షణాలు ఉన్నా సరే ఆసుపత్రులలో వైద్య పరీక్షలు చేయడం లేదంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇన్ని పరిస్థితులు ఉద్భవించడానికి గల కారణం కేవలం ట్రంప్ నిర్లక్ష్యం, ముంచు చూపు లేక పోవడమే నంటూ అమెరికా ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది.

ఇదే అదునుగా డెమోక్రటిక్ పార్టీ నేతలు సైతం ట్రంప్ ఓ అసమర్ధుడు అంటూ ప్రచారం చేస్తున్నారు వెరసి.ఈ ప్రభావం మొత్తం రానున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలపై తీవ్రమైన ప్రభావం చూపనుందని ట్రంప్ ఊహించని తీరిలో పదివి పోగొట్టుకోవడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు…

.

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు