ప్రపంచం మొత్తం కరోనా నుండి ఇప్పుడిపుడే కోలుకుంటుందన్న విషయం తెలిసిందే.దాదాపుగా అన్ని దేశాల్లో ప్రజలు ఎప్పటిలా జీవించడానికి అలవాటు పడుతున్నారు.
కానీ ఈ నాలుగుదేశాల్లో మాత్రం కరోనా భయం ఇంకా వీడిపోలేదట.అత్యంతమైన ఆధునిక టెక్నాలజీ ఉన్న ఈ దేశాల్లో భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు అవుతుండటం దురదృష్టమే.
ఆ దేశాలను చూస్తే అమెరికా, యూరప్, బ్రెజిల్, రష్యా దేశాల్లో ఇంకా కరోనా భయం వెంటాడుతూనే ఉన్నదట.ఇకపోతే నిన్న ఒక్కరోజే ప్రపంచం మొత్తం మీద 3.62 లక్షల కరోనా కేసులు నమోదవ్వగా, 9,806 మంది మృతి చెందినట్లు అధికారులు వెల్లడించారట.
కాగా అమెరికాలో కరోనా కేసులు, మరణాల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదట.
ఇక ఈ నాలుగు దేశాల్లో కేసుల వివరాలు చూస్తే.అమెరికాలో నిన్న 2003 మంది కరోనాతో మృతి చెందారు.
మెక్సికోలో 1323, బ్రెజిల్ లో 1046, బ్రిటన్ లో 621, రష్యాలో 502 మంది మృతి చెందారు.కాగా ఈ దేశాల్లో రాబోయే రోజుల్లో కరోనా మరణాలు మరింతగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఆయా దేశాల్లోని ప్రభుత్వాలు అప్రమత్తం అవుతున్నాయట.