కరోనా ప్రభావం, రోడ్డు పై రూ. 500 నోట్లు పడితే భయపడుతున్న జనం

కరోనా వైరస్ మహమ్మారి వచ్చాక జనాలు కరెన్సీ నోట్లను చూసినా భయపడిపోయే పరిస్థితులు వచ్చేశాయి.ఇంతకముందు చిల్లర డబ్బులు కనిపిస్తేనే అటు ఇటు చూసి తీసుకొని జేబు లో వేసుకుంటూ ఉండే జనం ఇప్పుడు రోడ్డు పై రూ.500 నోట్లు కనిపించినా కూడా కనీసం కంటితో చూడడానికి కూడా భయపడిపోతున్నారు.దీనికి కారణం ఈ కరోనా మహమ్మారి అనేది కరెన్సీ నోట్ల పై 24 గంటల వరకు సజీవంగా ఉంటుంది అని వార్తలు వస్తున్న నేపథ్యంలో జనాలు నోట్లు కాదు కదా చిల్లర డబ్బులు కనిపించినా భయపడిపోతున్నారు.

 Currency Notes To Create Panic In Lucknow, Corona Virus, Corona Virus Spread Wit-TeluguStop.com

ఈ కరోనా కారణంగా దేనిని ముట్టుకోవాలి అన్నా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది.ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో లో ఒక సంఘటన చోటుచేసుకుంది.

రోడ్డు పై రెండు ఐదు వందల నొట్లు కనిపించడం తో ఒక్కసారిగా భయపడిన జనం వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.దీనితో పోలీసులు అక్కడకు చేరుకొని ఆ నోట్లను అక్కడ నుంచి సమీపంలో ఉన్న వైద్యుడి వద్దకు తీసుకెళ్లగా, 24 గంటలపాటు నోట్లను ముట్టుకోవద్దని, 24 గంటల వరకు నోట్లపై వైరస్ సజీవంగా ఉంటుందని చెప్పడం తో ఆ నోట్లను జాగ్రత్తగా అక్కడి నుంచి తరలించినట్లు తెలుస్తుంది.

అయితే స్థానికులు మాత్రం నోట్ల కరెన్సీ ద్వారా కరోనా వైరస్ వ్యాప్తి చేస్తున్నారు అని కావాలనే ఈ నోట్లను రోడ్డుపై పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు.ఈ కరోనా ప్రభావం తో వెయ్యి రూపాయలు రోడ్డుపై కనిపించినా జనాలు అటు ఇటు చూసి తీసుకొనే వారు అలాంటిది ఈ కరోనా పుణ్యమా అని ఇలా పోలీసులకు ఫిర్యాదు చేసే పరిస్థితి ఏర్పడింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube