అలా ఎలా : చనిపోయిన తర్వాత కరోనా పాజిటీవ్ రావడమేంటీ…  

Corona Virus Corona Virus Death News Guntur News Death Person Got Corona Positive - Telugu Corona Virus, Corona Virus Death News, Death Person Got Corona Positive, Guntur News

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి ఎంతగా కలకలం సృష్టిస్తుందో పెద్దగా చెప్పనవసరం లేదు.ఈ కరోనా వైరస్ కారణంగా దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి.

 Corona Virus Corona Virus Death News Guntur News Death Person Got Corona Positive

అయినప్పటికీ అడపాదడపా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి.అయితే తాజాగా టీబీ వ్యాధి సోకినటువంటి వ్యక్తి మరణించిన తర్వాత అతడికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చిన ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో వెలుగులోకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే ఓ వ్యక్తి దాదాపుగా పది రోజుల క్రితం టీబీ వ్యాధి కారణంగా చికిత్స కోసం ఆసుపత్రిలో చేరాడు.అయితే ఈ వ్యక్తి ఇటీవలె చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం మృతి చెందాడు.

అలా ఎలా : చనిపోయిన తర్వాత కరోనా పాజిటీవ్ రావడమేంటీ…-General-Telugu-Telugu Tollywood Photo Image

దాంతో వైద్యులు అతడి రక్త నమూనాలను సేకరించి కరోనా వైరస్ పరీక్షలు జరపగా పాజిటివ్ వచ్చింది.దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించి మృతుడి బంధువులు మరియు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని వారికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేపట్టారు.

అయితే మృతుడి కుటుంబ సభ్యులకి కరోనా వైరస్ సోకలేదు.దీంతో స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కొంత ఊపిరి పీల్చుకున్నారు.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ఇప్పటివరకు నమొధైనటువంటి వైద్య గణాంకాలను పరిశీలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తంగా 361 పాజిటివ్ కేసులు నమోదైనట్లు తెలుస్తోంది.అయితే ఇందులో 9 మంది ఈ కరోనా వైరస్ బారి నుంచి కోలుకోగా మరో నలుగురు మృతి చెందారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Death Person Got A Corona Virus Positive In Guntur Related Telugu News,Photos/Pics,Images..