కరోనా ఎఫెక్ట్: రోడ్లపై ఆ హెల్మెట్ల తో పోలీసులు  

Corona Virus Corona Helments India Lock Down - Telugu Chennai Police Wearing Coronavirus Helmet To Raise Awareness On Covid-19, Corona Helments, Corona Virus In India, India Lock Down, Police Wear Corona Symbol Helment

కరోనా వైరస్ భారతదేశంలో కూడా తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న విషయం తెలిసిందే.ఇప్పటికే దేశవ్యాప్తంగా కరోనా సోకి 26 మంది మృతి చెందగా, దాదాపు 1000 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

 Corona Virus Corona Helments India Lock Down

అయితే ఇంతగా ప్రళయం సృష్టిస్తున్న ఈ కరోనా మహమ్మారి ప్రజలకు సోకకుండా ఉండడం కోసం అని లాక్ డౌన్ ను ప్రకటించినప్పటికీ జనాలు ఏమాత్రం లెక్కచేయకుండా రోడ్లపై దర్శనమిస్తూనే ఉన్నారు.ఈ నేపథ్యంలో కరోనా వైరస్ పై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఒక సీనియర్ పోలీసు అధికారి సూచనతో చెన్నైలోని ఆర్టిస్ట్ విచిత్రమైన హెల్మెట్ నొక దానిని రూపొందించాడు.

విరిగి.పాడై పోయిన హెల్మెట్ ముక్కలను, కొన్ని కాగితాలను కలిపి ఆ హెల్మెట్ ను గౌతమ్ అనే ఆర్టిస్ట్ తయారు చేసినట్టు తెలుస్తుంది.

కరోనా ఎఫెక్ట్: రోడ్లపై ఆ హెల్మెట్ల తో పోలీసులు-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

అంతా దీన్ని ‘కరోనా వైరస్ హెల్మెట్’ అని పిలుస్తున్నారు.లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజలు వీధుల్లోకి రాకుండా చూసేందుకు ఈ వెరైటీ హెల్మెట్ ని డిజైన్ చేసినట్టు గౌతమ్ చెబుతున్నాడు.

వీధుల్లో 24 గంటలూ సేవలందిస్తున్న పోలీసులు ఈ కొత్తరకం హెల్మెట్ ను ధరించి మంచి ఫలితాలను కూడా పొందుతున్నట్లు తెలుస్తుంది.తాము ఎన్ని చర్యలు తీసుకున్నా ప్రజలు రోడ్లపైకి వస్తున్నారని, వారిని మళ్ళీ వారి వారి ఇళ్లకు పంప లేకపోతున్నామని, కనీసం ఈ హెల్మెట్ ‘అవతారాన్ని’ చూసి అయినా వారు వెనక్కి వెళ్తారని భావిస్తున్నట్లు ఖాకీలు చెబుతున్నారు.

అయితే వెస్ట్ మెటిరీయల్ తో తయారు చేసిన ఈ హెల్మెట్ మొత్తానికి మంచి ఫలితాలను ఇస్తోందట.అయితే పౌరుల్లో చాలామంది ఈ ‘భయానక’ హెల్మెట్ చూసి.బెంబేలెత్తిపోతుండగా, కొందరు అయితే కరోనా పై అవగాహన కల్పించడానికి పోలీసులకు ఇంతకంటే మంచి ఐడియా తట్టలేదా అంటూ పెదం విరుస్తున్నారట.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Related Telugu News,Photos/Pics,Images..