కరోనా గురించి చైనా తెలిపిన మరో నమ్మలేని నిజం,ఇలాకూడా జరుగుతుందా  

Corona Virus Chaina Corona Virus Urine And Kalle Corona Patients Quarantaine - Telugu Chaina Corona Virus, Corona Patients, Corona Virus, Quarantaine, Urine And Kalle

కరోనా మహమ్మారి సృష్టిస్తున్న ప్రళయం కి ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 8 లక్షల మంది ఈ వైరస్ బారిన పడగా,40 వేలమందికి పైగా మృతి చెందిన విషయం తెలిసిందే.అయితే ఈ కరోనా వైరస్ మనుషుల్లో 14 రోజుల పాటు ఉంది ఆ తరువాత తన ప్రభావం చూపుతుంది అని, ఈ వైరస్ సోకిన వారితో పాటు వారితో డైరెక్ట్ కాంటాక్ట్ లో ఉండేవారి కి కూడా సోకుతుంది అని,కావున జాగ్రత్తగా ఉండాలి అంటూ వైద్య నిపుణులు,శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.

 Corona Virus Chaina Corona Virus Urine And Kalle Corona Patients Quarantaine

అయితే చైనా లో మాత్రం ఇటీవల ఒక నమ్మలేని నిజం బయటపడింది.ఈ నిజం ప్రపంచ దేశాలను మరింత కలవరానికి గురి చేస్తుంది.

ఇంతకీ ఆ విషయం ఏమిటంటే కరోనా నెగిటివ్ గా నిర్ధారణ అయిన కొందరి పేషేంట్స్ నుంచి సేకరించిన కళ్లే,మలం నమూనాలో కరోనా వైరస్ ను గుర్తించినట్లు చైనా డైరెక్టర్లు చెబుతున్నారు.అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్లో ఈ రీసెర్చ్ ప్రచురితమైనట్లు సమాచారం.

కరోనా గురించి చైనా తెలిపిన మరో నమ్మలేని నిజం,ఇలాకూడా జరుగుతుందా-Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image

కోవిడ్ ఎఫెక్ట్ అయిన వ్య‌క్తిని హాస్పిట‌ల్ నుంచి డిచ్చార్జ్ చేసేముందు ఎక్కువ‌గా క‌ఫం ద్వారా టెస్టులు చేస్తారు.ఈ క్రమంలోనే కొందరి పేషేంట్స్ కు టెస్టులు నిర్వహించగా ఇలాంటి రిజల్ట్ వచ్చినట్లు తెలుస్తుంది.

అయితే వచ్చిన రిజ‌ల్ట్స్ సరైనవేనా.లేక బాడీలోని ఇతర భాగాల నుంచి శాంపిల్స్ సేకరించాలా అనే విషయంపై పరిశోధకులు చర్చలు జరుపుతున్నారు.

టెస్టుల్లో కోవిడ్ నెగిటివ్గా తేలిన తర్వాత కూడా కొందరు రోగుల కళ్లెలో 39 రోజులు, మలంలో 13 రోజుల పాటు ఈ డేంజ‌ర‌స్ వైరస్ ఉంటున్నట్లు గుర్తించడం ప్రపంచ దేశాలను మరింత కలవరపెడుతుంది.అయితే ఈ రిజ‌ల్ట్స్ ద్వారా ఇతరుల‌కు వైర‌స్ వ్యాప్తి చెందుతుంద‌నే విష‌యంపై క్లారిటీ లేద‌ని వైద్యులు పేర్కొన్నారు.

ఈ విష‌యంపై మ‌రింత అధ్య‌య‌నం అవ‌స‌ర‌మ‌ని వారు అభిప్రాయ‌ప‌డ‌తున్నారు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Corona Virus Chaina Corona Virus Urine And Kalle Corona Patients Quarantaine Related Telugu News,Photos/Pics,Images..